కృష్ణా జిల్లా నాగాయలంక మండలం లంక గ్రామాలైన ఎదురు మొండి నుండి నాచుగుంట రోడ్డు
గత ఐదు సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని చివరికి రెండు సార్లు టెండర్ పిలవటం, క్యాన్సల్ చేయడం కాంట్రాక్టర్లు రాక, మళ్లీ ఎస్టిమేట్స్ తయారు చేసి టెండర్ పిలవటం పనులు మొదలు పెట్టడం జరిగింది. కానీ ఏడున్నర కిలోమీటర్ల లో కొంతమేర రిజర్వు ఫారెస్ట్ క్రింద ఉందట. రెండు మూడు నెలలలో ఎలక్షన్ ఫీవర్ మొదలవుతుంది. గ్రామస్తులు అన్ని విధాల సం సిద్ధంగా ఉన్నారు. త్వరగా ఈ రోడ్డుని పూర్తి చేసుకుంటే మారుమూల లంక గ్రామాలు అయిన నాచుగుంట ఈల చెట్ల దెబ్బలకు ఐదు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మంచి రోడ్డు వసతి కలుగుతుంది. ఆలస్యం అయితే రోడ్డు రాకపోవటం కాకుండా రిలీజ్ అయిన బడ్జెట్ ఒవెర్లప్ అవ్వడం,మళ్ళా కాంట్రాక్టర్ దొరకటం కష్టమవుతుంది. ఆలస్యం అయ్యే కొద్ది ఎలక్షన్ తర్వాత పరిస్థితులు మళ్లీ అనుకూలిస్తే తప్ప ఈ రోడ్డు రాదు. కనుక త్వరగా ఈ విషయం ఫై సర్ద వహిస్తారని గ్రామస్తుల మనవి.