- ఈశాన్య రాష్ట్రం త్రిపురలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని
ప్రధాని నరేంద్ర మోదీ ఈశాన్య రాష్ట్రం త్రిపురలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చేపట్టారు. అక్కడ జరిగిన రెండు ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడిన మోదీ...వామపక్ష సర్కార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. రాష్ట్రంలో ఇప్పుడు పురాణ మానిక్ సీఎంగా ఉన్నారంటూ త్రిపుర సీఎం మాణిక్ సర్కార్‌నుద్దేశించి సెటైర్లు విసిరారు. త్రిపురలో బీజేపీకి అధికార పగ్గాలు కట్టబట్టాలని పిలుపునిచ్చారు. వామపక్ష కార్యకర్తల బెదిరింపులకు ఓటర్లు భయపడాల్సిన అవసరం లేదని, వారికి బీజేపీ అండగా నిలుస్తుందన్నారు. సుపరిపాలనే తమ పార్టీ అజెండాగా వ్యాఖ్యానించారు. సాయంత్రం ప్రచారాన్ని పూర్తి చేసుకున్న మోదీ...ఢిల్లీకి తిరుగుపయనమయ్యారు.