రాష్ట్రంలో ఐటీ దాడులు శుక్రవారం పెద్ద ఎత్తున ప్రారంభమయ్యాయి. మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ ఆస్తులు, విద్యాసంస్థల్లో ఐటీ సోదాలు జరిగాయియ. తెల్లవారుజామున విజయవాడ ఆటోనగర్లోని ఐటి ఆఫీసులో సోదాలపై ఐటీ అధికారులు కార్యాచరణ రూపొందించినట్లు సమాచారం. విజయవాడ, గుంటూరు నుంచి వచ్చిన ఐటీ అధికారులు పోలీసుల రక్షణలో సోదాలు చేస్తున్నారు. మరోవైపు, నెల్లూరు జిల్లా దగదర్తి మండలం దామవరంలోని బీఎంఆర్ ఫ్యాక్టరీపై జరిగిన ఐటీ దాడుల్లో కీలక డాక్యుమెంట్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఉదయం కుడా అక్కడ సోదాలు జరిగాయి. బీఎంఆర్ సంస్థ అధినేత, టీడీపే నేత బీద మస్తాన్ రావు చెన్నైఆఫీసులోనూ సోదాలు జరిగాయి. ఇటు శ్రీకాకుళం జిల్లాలోనూ ఐటీ అధికారుల సోదాలు జరుపుతున్నారు. పలాసలో ఐటీ అధికారుల విస్తృత తనిఖీలు చేసారు. ముఖ్యంగా జీడిపప్పు పరిశ్రమ యజమానుల ఆస్తులపై దాడులు జరిగాయి. విజయనగరం జి ఎస్ టి కమిషనర్ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు అసిస్టెంట్ కమిషనర్లు ఉమా మహేశ్వరరావు, మోహనరావు నేతృత్వంలో కాశీబుగ్గ అసిస్టెంట్ కమిషనర్ భానుమతి, సిబ్బంది మెరుపు దాడులు నిర్వహించారు.