గత నెల సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించాం. లక్షా 90 వేలమంది భక్తులు స్వామివారి వాహన సేవను తిలికించేలా గ్యాలరీలను ఏర్పాటు చేసాం. ఆన్లైన్ రిజిస్టేషన్ మీద కొత్త విధానం అమల్లోకి తెస్తున్నామని టీటీడీ ఈవో ఏకే సింఘల్ అన్నారు. శుక్రవారం అయన మీడియతో మాట్లాడారు. ఒక ఫోన్ నెంబర్ మీద రెండు సేవాటికెట్లను బుక్ చేసుకునే విధానం అమల్లోకి తెస్తాం. ఆధార్ కార్డ్ బార్ కోడ్ ద్వారా టికెట్లను పరిశీలించే విధానం ఏర్పాటు చేస్తామిన అన్నారు. గత బ్రహ్మోత్సవాల సమయంలో దర్శన విషయాల్లో ఎలాంటి నిర్ణయాల్లో తీసుకున్నామో అదే విధానం కొనసాగిస్తాం. తిరుచానూరు అమ్మవారి సేవాటికెట్లను ఆన్ లైన్ విధానంలో భక్తులు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం. .50శాతం ఆన్ లైన్, 50శాతం కరెంట్ బుకింగ్ ద్వారా బుక్ చేసుకోవచ్చని అయన అన్నారు. 4కోట్ల 70 లక్షల వ్యయంతో అప్పలయగుంటలో కల్యాణమండపం ఇతర పనులకు ఆమోదం తెలిపాం.. నూతనంగా టేబుల్ క్యాలండర్ కొత్తగా ప్రవేశ పెట్టామని అన్నారు. గీతా మహోత్సవం సందర్భంగా కురుక్షేత్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామి అలయంకు సుమారు 2 నుండి 3 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో అదనపు సిబ్బందిని నియమిస్తున్నాంమని అన్నారు. గతనెల స్వామివారిని దర్శించుకున్న సెప్టెంబర్ నెల భక్తుల సంఖ్య..23.39లక్షలు, గత నెల భక్తులకు అందించిన లడ్డులు లసంఖ్య 84 లక్షలు,ఈ నెల 98.24 లక్షలు. గతనెల హుండీ ఆదాయం రూ 78 కోట్లు, ఈ నెల 87 కోట్లు వచ్చాయని అయన వెల్లడించారు.