YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నవ్వుకోండి

‘మీరు నా ఫస్ట్ అండ్ లాస్ట్ లవ్ సార్’

‘మీరు నా ఫస్ట్ అండ్ లాస్ట్ లవ్ సార్’

- ట్విట్టర్‌లో నటుడు బ్రహ్మాజీతో రష్మీ

బుల్లితెరపై షోలతో పాటు అప్పుడప్పుడూ సినిమాలతో కూడా అభిమానులను పలకరిస్తుంటుంది రష్మీ. అంతేకాదు సోషల్ మీడయాలో కూడా ఆమెకు ఫాలోవర్లు లక్షల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రష్మి ట్విట్టర్‌లో తన అభిమానులతో ముచ్చడించింది. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పింది రష్మి. అయితే రష్మి, ఆమె అభిమానుల ఛాటింగ్‌ మధ్యలో నటుడు బ్రహ్మాజీ కూడా ఎంటర్ అయ్యాడు. రష్మిని అభిమానులు అడిగిన ప్రశ్నలకు అతను సమాధానం చెబుతూ అందరి చేత నవ్వులు పూయించాడు. ఆ కన్వర్జేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

నీకు ఎవరైనా బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడా? అంటూ నెటిజన్ ప్రశ్నకు రష్మి ఉన్నారంటూ సమాధానం ఇవ్వగా.. మధ్యలో ఎంటరైన బ్రహ్మాజీ ‘ప్లీజ్ చెప్పొద్దు.. నా పేరు రివీల్ చెయ్యకు’ అంటూ సమాధానం ఇచ్చాడు. దానికి రష్మి ‘మీరు నా ఫస్ట్ అండ్ లాస్ట్ లవ్ సార్’ అంటూ లవ్ సింబల్‌తో సమాధానమిచ్చింది. ఇక మరో నెటిజన్ ‘సుధీర్ గురించి ఒక్క వర్డ్ చెప్పు’ అంటూ రష్మిని కోరగా.. మళ్లీ ఎంటరైన బ్రహ్మాజీ ‘సుడిగాలి’ అని ఆన్సర్ చేశారు. మరో నెటిజన్ బ్రహ్మాజీని ఉద్దేశిస్తూ ‘బ్రహ్మాజీ గారు మీకు మ్యారేజ్ అయినా కానీ మీరు యవ్వనంగా ఉండటానికి కారణమేంటి?’ అని ప్రశ్నించారు. దీనికి బ్రహ్మాజీ ‘మ్యారేజ్ చేసుకోండి’ అంటూ కొంటెగా సమాధానం ఇచ్చాడు. 

Related Posts