రాష్ట్రంలో రాజకీయ కక్షతో ఐటీ దాడులు జరుగుతున్నాయని వాదన లో ఎలాంటి వాస్తవం లేదు. జాతీయ బిజెపి పార్టీ నుండి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఎటువంటి ప్రభుత్వాలపై కక్షసాధింపు చర్యలు ఉండవని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. శుక్రవారం అయన మంగళగిరిలో మీడియాతో మాట్లాడారు. బీజేపీని అప్రతిష్టపాలు చేయడానికి మాత్రమే అధికార తెలుగుదేశం పార్టీ ఇటువంటి ఆరోపణలు చేస్తోందని అయన విమర్శించారు. అధికార తెలుగుదేశం పార్టీ అవినీతి బురదలో కూరుకుపోయి బిజెపి పార్టీ ని కూడా బురదలో దింపడానికి ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.