తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని ఏపీ రోడ్లు భవనాల శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామి వారికి జరిగే నైవేద్య విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు మంత్రిని ఆశీర్వదించగా ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తిరిగి టీడీపీ రావాలని, చంద్రబాబు నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. చంద్రబాబు నాయకత్వంలో నాలుగున్నర ఏళ్ళుగా రాష్ట్రంలో శాంతిభద్రతలు భేషుగా వున్నాయని,ఐతే కొద్దిరోజుల క్రిత్తం అరకులో జరిగిన ఘటన దురదృష్టకరమని,ఇద్దరు నాయకులను మావోలో హతమార్చడం అమానుషమని మంత్రి పేరుకున్నారు.మావోలకేమైన సమస్యలు వుంటే ప్రభుత్వం చర్చలను జరపాలే కానీ ఇలాంటి దాడులకు పాలుపడకూడదని,హత్యలు జరిగి ఇన్ని రోజులు గడుస్తున్నా వారి నుంచి కారణాలు ఇంకా వెల్లడి కాలేదని అయ్యన్న మావోలను విమర్శించారు.