YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

14 రాష్ఠ్రాల్లో ఐదు రూపాయిలు తగ్గిన పెట్రోలు

14 రాష్ఠ్రాల్లో ఐదు రూపాయిలు తగ్గిన పెట్రోలు
కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలను రూ.2.50 తగ్గించడంతో.. శుక్రవారం (అక్టోబరు 5) దేశవ్యాప్తంగా ఇంధన ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇందులో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలో రూ.2.50 మేర పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గాయి. ప్రస్తుతం పెట్రోలు ధర రూ.81.50 గా, డీజిల్ ధర రూ.72.95 గా ఉన్నాయి. ఇక వాణిజ్య రాజధాని ముంబయిలో రూ.5 రూపాయలు తగ్గిన లీటర్ పెట్రోలు ధర రూ.90 దిగువకు చేరి రూ.86.97 గా నమోదైంది. డీజిల్ ధర రూ.2.50 తగ్గి 77.45కి చేరింది. హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర తగ్గి రూ.86.40, డీజిల్ ధర రూ.79.35గా ఉందిపెట్రోలు, డీజిల్ ధరలపై కేంద్రం ప్రకటించిన రూ.2.50 తగ్గింపుతోపాటు దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాలు అదనంగా మరో 2.50 తగ్గింపు ప్రకటించాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో పెట్రోలు, డీజిల్ ధరపై లీటరుకు రూ.5 తగ్గినట్లయింది. వాటిల్లో గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, ఝూర్ఖండ్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, అసోం, త్రిపుర, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఉన్నాయి. 

Related Posts