వెస్టిండీస్ బౌలర్లను ఆటాడుకున్నారు టీమిండియా బ్యాట్స్‌మన్. ఏకంగా ముగ్గురు బ్యాట్స్‌మెన్ సెంచరీలతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 649 పరుగుల భారీ స్కోరు దగ్గర ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. లోకల్ బాయ్ రవీంద్ర జడేజా కూడా తన సొంత గడ్డపై కెరీర్‌లోనే తొలి సెంచరీ చేశాడు. 132 బంతుల్లో అతను మూడంకెల స్కోరు అందుకోగానే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది టీమిండియా. అతని ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. అంతకుముందు విరాట్ కోహ్లి 139, పృథ్వీ షా 134, రిషబ్ పంత్ 92, పుజారా 86 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. విండీస్ బౌలర్లలో దేవేంద్ర బిషూ 4 వికెట్లతో రాణించాడు.4 వికెట్లకు 364 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్.. ధాటిగా ఆడింది. ఇవాళ 60 ఓవర్లు ఆడి మరో 285 పరుగులు చేసింది. ముఖ్యంగా తొలి సెషన్‌లో కోహ్లి, పంత్ చెలరేగి ఆడారు. ఆ తర్వాత జడేజా టెయిలెండర్ల సాయంతో స్కోరును 600 దాటించడంతోపాటు తన కెరీర్‌లో తొలి సెంచరీని అందుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మూడు ట్రిపుల్ సెంచరీలు చేసిన జడేజాకు ఇంటర్నేషనల్ కెరీర్‌లో తొలి సెంచరీ చేయడానికి 169 ఇన్నింగ్స్ పట్టడం విశేషం. ఈ మూమెంట్‌ను తనదైన ైస్టెల్లో బ్యాట్‌ను కత్తిలా తిప్పుతూ సెలబ్రేట్ చేసుకున్నాడు.