వచ్చే నెల 30వ తేదీన డీఎస్సీ పరీక్ష నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. సచివాలయంలోని తన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఏపీపీఎస్సీ ద్వారా కాకుండా డీఎస్సీ ద్వారా నిర్వహించనున్నామన్నారు. ఈ నెల 10 తేదీన డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. వచ్చే నెల 30 న రాత పరీక్ష, జనవరి 3, 2019న ఫలితాలు విడుదల చేస్తామని మంత్రి తెలిపారు. ఈ డీఎస్సీ ద్వారా 9,275 పోస్టులు భర్తీ చేస్తామన్నారు. టెట్ కమ్ టీఆర్టీ నిర్వహిస్తామన్నారు. సీఎం చంద్రబాబునాయుడుతో మాట్లాడిన తరవాత డీఎస్సీ ప్రకటన విడుదల చేస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.