గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో బిజెపి పార్టీ సమావేశంలో ష్ట్ర పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పాల్గోన్నారు. కన్నా మాట్లాడుతూ రాష్ట్రంలో ఈరోజు కొన్నిచోట్ల అదాయ పను శాఖ దాడులు జరుగుతుంటే అధికార పార్టీ లో ఉన్న కొంతమంది నాయకులు ఆందోళన ఎందుకు అర్థం కావటం లేదు. పార్టీ ఎందుకు ఆందోళన చెందుతుంది మాకు అర్థం కావట్లేదు. రాష్ట్రానికి దేశానికి రావలసిన ఆదాయాన్ని పన్నులు చెల్లించకుండా రాజకీయ ముసుగులో కొంత మంది ఉంటే మీరు కూడా దొంగలుగా మారాలనుకుంటున్నారా అని అన్నారు. టిడిపి పార్టీ దొంగల పార్టీగా మారిపోతుంది . పక్క రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ చంద్రబాబు నాయుడు ను తిడితే కొంతమంది ఆత్మాభిమానం ఆత్మగౌరవం అంటున్నారు. సాక్షాత్తు ప్రధానమంత్రిని మీ పార్టీలో ఉన్న నాయకులు తిట్టినప్పుడు ఈ ఆత్మాభిమానం గుర్తుకు రాలేదా అని అగిగారు. బిజెపి పార్టీ వారిని రోజు తిట్టడానికి సైకిల్ దొంగతనాలు, పిక్ పాకెట్ దొంగతనాలకు పాల్పడిన వారి చేత ప్రెస్ మీట్ లు పెట్టిస్తున్నారని అన్నారు. అధికార పార్టీలో ఉన్న అవనీతిని వెలుగులో తీసుకొస్తుంటే తన మన భేదం లేకుండా ఇష్టమొచ్చినట్టు తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. టిడిపిపార్టీ చేస్తుంది దీనికి 2019లో అని ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు.