YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

మున్నా జింగాడా కోసం రెండు దేశాలు ఢీ

Highlights

 

మున్నా జింగాడా కోసం రెండు దేశాలు ఢీ

ఛోటాషకీల్ ముఠా సభ్యుడైన ముదస్సర్ హుసేన్ సయ్యద్ అలియాస్ మున్నా జింగాడా కోసం థాయ్‌ల్యాండ్ కోర్టులో భారత్, పాక్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. చోటాషకీల్ కోరిక మేరకు 2000 సంవత్సరంలో బ్యాంకాక్‌లో చోటారాజన్‌పై జింగాడా హత్యాయత్నం జరిపాడు. రాజన్ తప్పించుకోగా ఆయన సహాయకుడు రోహిత్ వర్మ ఆ దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో మున్నాకు పదేండ్ల జైలుశిక్ష పడింది. 2012లో శిక్షాకాలం పూర్తి చేసుకున్నాడు. ముంబైకిచెందిన జింగాడా ఎన్నో కేసులిలో నిందితుడని, అతడిని తనకు అప్పగించాలని భారత్ థాయ్‌ల్యాండ్‌కు విజ్ఞప్తి చేసింది. జింగాడా భారతీయ పౌరుడని రుజువు చేసే పకడ్బందీ సాక్ష్యాలు సమర్పించింది. బొంబాయిలో జింగాడా నేరాల చిట్టాతోపాటుగా అందులో డీఎన్‌ఏ శాంపిల్స్ కూడా ఉన్నాయి. ఈ విజ్ఞప్తికి అనుకూలంగా థాయ్ కోర్టు తీర్పు కూడా చెప్పింది. దీంతో పాకిస్థాన్ రంగంలోకి దిగింది. నకిలీ పాకిస్థాన్ పాస్‌పోర్టుతో జింగాడా థాయ్‌ల్యాండ్‌కు వచ్చాడు. ఇప్పుడు పాకిస్థాన్ అతడు నిజంగా పాక్ పౌరుడేనంటూ దొంగపత్రాలు సమర్పించింది. అందులో టెన్త్ సర్టిఫికెట్ వంటివి ఉన్నాయి. అసలు పాకిస్థాన్ ఈ చోటా గ్యాంగ్ సభ్యునికోసం ఇంతగా ఎందుకు ఎత్తులు వేస్తున్నదీ అంటే దానికీ కారణాలున్నాయి. జింగాడా తీగను లాగితే దావూద్ డొంకంతా కదులుతుందని పాక్ భయమట. దావూద్ ఆనుపానులు బయటపడడం ఒక సమస్య అయితే అతడు పాకిస్థాన్‌లోనే ఉన్నాడని తిరుగులేకుండా రుజువు కావడం మరో సమస్య. ఒకవేళ జింగాడాను న్యాయ ప్రక్రియ ద్వారా పాక్ స్వాధీనం చేసుకోవడం కుదరకపోతే అతనిని దావూద్ ముఠా చంపేసినా దిక్కులేదని అంటున్నారు. ప్రస్తుతం మాత్రం అందరి కళ్లూ థాయ్ కోర్టు నిర్ణయం పైనే ఉన్నాయి.

Related Posts