Highlights
కృష్ణా జిల్లా కంకిపాడు లో విజయ డైరీ వారి యొక్క యూనిట్ 2008లో 7 కోట్ల ఖర్చుతో ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం ఈ యూనిట్ సరిగా పనిచేయడం లేదు.
రమారమి 50 వేల లీటర్ల కెపాసిటీ ఉన్న యూనిట్ ప్రస్తుతం ఎలాంటి ఆదరణకు నోచు కోకుండా ఉంది. ప్రత్యక్షంగా , పరోక్షంగా 50 మంది వరకు ఉపాధి కలిగే అవకాశం ఉన్న యూనిట్ ఇది.. ప్రస్తుతం పాలు ఎక్కువగా దొరికే సీజన్ మొదలైంది
ఈ యూనిట్ కి పూర్వవైభవం తీసుకురావాలంటే ఈ క్రింది విషయాల ఫై ప్రాధాన్యత ఇవ్వాలి;
దీనికి రెండు బీఎంసి యూనిట్లను అనుసంధానించి రెగ్యులర్గా పాలు లభ్యత గురించి సహాయం చేయవలసి ఉంటుంది.
ప్రస్తుతానికి కొంత వర్కింగ్ కాపిటల్ కూడా ఇవ్వవలసి ఉంటుంది.
ఇతర డైరీ యూనిట్లతో టై అప్ పెట్టుకొని కో ప్యాకింగ్ కూడ మొదలు పెట్టవచ్చు.
ఇక్కడ రమారమి 10 టన్నులు పెరుగు తయారు చేసే అవకాశం ఉంది. ఈ బల్క్ పెరుగును ఎన్టీఆర్ క్యాంటీన్ల గాని అక్షయపాత్ర గాని అనుసంధానిస్తే ఈ యూనిట్ చక్కగా పనిచేస్తుంది.
దయచేసి కంకిపాడు లోని ఈ మిల్క్ యూనిట్కు పూర్వ వైభవం తీసుకు వచ్చే దిశగా చూడాలని కంకిపాడు గ్రామస్తులందరూ కోరుతున్నారు.