YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అభివృద్ది పనులకు బ్రేక్ పడకూడదు టెలికాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు

 అభివృద్ది పనులకు బ్రేక్ పడకూడదు టెలికాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు
ఈ ఏడాది ఇప్పటివరకు వర్షపాతం లోటు మైనస్ 24% ఉంది. వరుసగా 3ఏళ్లు లోటు వర్షపాతం ఉన్నా తట్టుకోగలిగాం.  సమర్ధ నీటి నిర్వహణతో దిగుబడులు తగ్గకుండా చూశాం. ఈ ఏడాది కూడా వరి దిగుబడుల్లో మంచి పురోగతి ఉంది. ఇప్పటికే ముందస్తు అంచనాల్లో వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం నాడు అయన నీరు-ప్రగతి,వ్యవసాయంపై  టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గోన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ వర్షపాతం లోటులో కూడా గండికోటలో 12.5టిఎంసిల నీటిని నిల్వపెట్టాం. వర్షాలు లేకున్నా రాయలసీమ జిల్లాలలో చెరువులు నింపగలిగాం.వచ్చే ఏడాది గండికోటలో 20టిఎంసిలు నిల్వ చేయాలని సూచించారు. అభివృద్ధి అనేది ఒక గొలుసుకట్టు చర్య.ఎక్కడా, ఏ స్థాయిలో బ్రేక్ పడకూడదు.గొలుసు ఎక్కడ బ్రేక్ అయినా అభివృద్ధి ఆగిపోతుంది. ప్రతి శాఖలో వినూత్న విధానాలు రూపొందించాం.వాటిని సమర్ధంగా అమలు చేశాం.అనుకున్న ఫలితాలను సాధిస్తు న్నాం.ఇదే స్ఫూర్తిని ఇకపై కూడా కొనసాగించాలని అన్నారు. 10.5% వృద్ధి  రేటును 15%కు తీసుకెళ్లాలి.అందుకు అనుగుణంగా లక్ష్యాలను రూపొందించాలి.వాటిని చిత్తశుద్దితో అమలు చేయాలి. ఆర్ధిక వనరులు,మానవ వనరులను 100% సద్వినియోగం చేయాలి. భూగర్భ జలాలు,ఉపరితల జలాలను సమర్ధంగా వినియోగించాలి.అప్పుడే ప్రకృతి ఇబ్బందులను అధిగమించగలం.అనుకున్న ఫలితాలను సాధించగలమని అన్నారు. దిగువనుంచి ఎగువ స్థాయి వరకు ప్రజాసేవలో అందరూ నాయకులే. దీనిని అందరూ గుర్తించాలి,ఆచరణలో పెట్టాలి.
మైక్రో న్యూట్రియంట్స్ పంపిణీ 94% జరిగింది. దీనిని 100%కు తీసుకెళ్లాలి.అనంతపురంలో సూక్ష్మపోషకాల పంపిణి వేగవంతం చేయాలి.తెగుళ్లు ప్రబలకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. నెల్లూరు,కడప,కర్నూలులో పంట రుణాలు మరింతగా అందించాలి.తూర్పుగోదావరి కలెక్టర్ చొరవతో  100% పంటరుణాలు కౌలురైతులకు అందాయి.మిగిలిన కలెక్టర్లు కూడా కౌలురైతులపై అదేవిధంగా శ్రద్ధ పెట్టాలి. జాతీయస్థాయిలో 3% ఉన్నా,రాష్ట్రంలో 11% వ్యవసాయంలో వృద్ధిరేటు సాధించాం. నరేగా పనులు ముమ్మరం చేయాలి.పంటకుంటల తవ్వకం లక్ష్యాలను 
చేరుకోవాలి.చెరువుల మరమ్మతు పనులు వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు.

Related Posts