YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జగన్ డేరింగ్ కో లెక్కుంది...

జగన్ డేరింగ్ కో లెక్కుంది...
వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తాజాగా గుంటూరు జిల్లాలో నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జ్‌ల‌ను చాలా సులువుగా మార్చేస్తున్నారు. ఈ మార్పుల‌ను కొంద‌రు వ్య‌తిరేకిస్తుంటే… మ‌రికొంద‌రు ఆహ్వానిస్తున్నారు. రాజధాని జిల్లాలో జ‌గ‌న్ ఇంత డేరింగ్‌గా ఎందుకు సిట్టింగ్ ఇన్‌చార్జ్‌ల‌ను మారుస్తున్నారు ? అస‌లు తెర‌వెన‌క ఏం జ‌రుగుతుందో ఆరా తీస్తే జ‌గ‌న్ లెక్క‌లు జ‌గ‌న్‌కు ఉన్నాయ‌ని తెలుస్తోంది. తాజాగా జ‌గ‌న్ గుంటూరు, నరసారావుపేట ఎంపీ అభ్యర్థుల విషయంలో తీసుకున్న నిర్ణయం అన్ని ఈక్వేషన్ల పరంగా మ్యాచ్‌ అయ్యినట్టే కనపడుతుంది. గత ఎన్నికల్లో జగన్‌ గుంటూరు ఎంపీగా కాపు సామాజికవర్గానికి చెందిన తెనాలి మాజీ ఎంపీ వల్లభనేని బాలశౌరికి సీటు ఇచ్చారు. అదే టైమ్‌లో నరసారావుపేట ఎంపీగా ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆళ్ల అయోధ్యరామి రెడ్డిని రంగంలోకి దింపారు. జిల్లాల్లో ఎగ‌సిన టీడీపీ గాలుల నేపథ్యంలో గుంటూరులో బాలశౌరి, నరసారావుపేటలో అయోధ్యరామి రెడ్డి ఇద్దరూ ఓడిపోయారు.విచిత్రం ఏమిటంటే గత ఎన్నికల్లో టీడీపీ గుంటూరు, నరసారావుపేట నుంచి రెండు చోట్ల కమ్మ అభ్యర్థులనే రంగంలోకి దింపి విజయం సాధించింది. జిల్లాల్లో కీలక సామాజికవర్గంగా ఉన్న కమ్మ సామాజికవర్గానికి గత ఎన్నికల్లో జగన్‌ ఒక్క ఎంపీ సీటు కూడా కేటాయించలేదు. ఇది కూడా ఆ పార్టీకి జిల్లాల్లో పెద్ద ఎదురుదెబ్బగానే మారింది. ఈ క్రమంలోనే జిల్లా రాజకీయాలను శాసించే కమ్మ సామాజికవర్గానికి ఒక ఎంపీ సీటు ఇవ్వాలని ఎప్పుడో డిసైడ్‌ అయిన జగన్‌ మూడేళ్ల క్రితమే విజ్ఞాన్‌ విద్యాసంస్థల వైస్ చైర్మ‌న్‌ లావు శ్రీకృష్ణదేవరాయులకు గుంటూరు లోక్‌సభ నియోజకవర్గ వైసీపీ పగ్గాలు అప్పగించారు. మూడేళ్ల పాటు లోక్‌సభ సెగ్మెంట్‌ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆయ‌న‌ పర్యటిస్తూ పార్టీని పటిష్టం చేసుకుంటూ వచ్చారు.కొద్ది రోజుల రోజుల క్రితం జగన్‌ అనూహ్యంగా లావు శ్రీకృష్ణదేవరాయులను నరసారావుపేట లోక్‌సభ సెగ్మెంట్‌కు మార్చి గుంటూరుకు మాజీ కేంద్ర మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు, చిల్లీస్‌ మార్చంట్‌ అధినేత కిలారు వెంక‌ట రోశ‌య్య‌ను రంగంలోకి దింపారు. ఇక్క‌డ రోశ‌య్య ఎంట్రీతో నిన్నటి వరకు గుంటూరు లోక్‌సభ బాధ్యతలు చూసిన లావు శ్రీకృష్ణదేవరాయులు నరసారావుపేట సెగ్మెంటుకు మారాల్సి వచ్చింది. జగన్‌ చేసిన ఈ మార్పు చాలా మంది పార్టీ నేతలకు సైతం మింగుడుపడలేదు. అయితే వాస్తవంగా చూస్తే సామాజిక సమీకరణలు, ఇత‌ర‌త్రా కారణాలతో చాలా సుదూరంగా ఆలోచించే జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. గుంటూరు లోక్‌సభ సెగ్మెంట్లో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెనాలి, పొన్నూరు నుంచి కమ్మ వర్గానికి చెందిన అన్నాబత్తుని శివకుమార్‌, రావి వెంకటరమణ సమన్వయకర్తలుగా ఉన్నారు. ఈ లోక్‌సభ సెగ్మెంట్‌ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఒక్క చోట కూడా కాపు వర్గానికి చెందిన అభ్యర్థులు లేరు. దీంతో ఈ సెగ్మెంట్‌ పరిధిలో గుంటూరు సిటీ, పొన్నూరు, తెనాలి, మంగళగిరి నియోజకవర్గాల్లో బలంగా ఉన్న కాపు వర్గాన్ని తమవైపుకు తిప్పుకునే క్రమంలో జగన్‌ ఇక్కడ అదే వర్గానికి చెందిన కిలారు రోశ‌య్యను రంగంలోకి దించారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పోటీ చెయ్యనుండడంతో కాపువర్గం ఓటర్లు బలంగా ఆ పార్టీ వైపు మక్కు చూపుతారన్న అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే జగన్‌ వ్యూహాత్మకంగా ఒకే దెబ్బతో అటు జనసేనకు ఇటు టీడీపీకి చెక్‌ పెట్టేలా కిలారు వెంకట రోశ‌య్యకు గుంటూరు లోక్‌సభ నియోజకవర్గ పగ్గాలు అప్పగించినట్లు స్పష్టం అవుతోందిఇక న‌ర‌సారావుపేట విష‌యానికి వ‌స్తే నియోజకవర్గాల పున‌ర్విభజనకు ముందు నరసారావుపేట లోక్‌సభ నియోజకవర్గంలో ప్రకాశం జిల్లాలోని దర్శి, కంభం (ఇప్పుడు ర‌ద్ద‌య్యింది ), మార్కాపురం అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా ఉండేవి. అప్ప‌ట్లో ఆ సెగ్మెంట్ల‌లో రెడ్ల ప్రాబ‌ల్యం ఎక్కువగా ఉండేది. ప్రధాన పార్టీలు ఎక్కువగా రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారికే నరసారావుపేట ఎంపీ సీటు వస్తూ ఉండేవి. నేదురుమెల్లి జనార్ధన రెడ్డి, మేకపాటి రాజమోహన్‌ రెడ్డి లాంటి వాళ్లు సైతంనరసారావుపేట నుంచి ఎంపీగా విజయం సాధించారు. 2009లో నియోజకవర్గాల పున‌ర్విభజన తర్వాత ప్రకాశం జిల్లాలో మూడు అసెంబ్లీ సెగ్మెంట్లు నరసారావుపేట నుంచి విడిపోగా కొత్తగా చిలకలూరిపేట, సత్తెనపల్లి, పెదకూరపాడు అసెంబ్లీ సెగ్మెంట్లు నరసారావుపేటలో చేరాయి. దీంతో ఇప్పుడు నరసారావుపేటలో కమ్మ, రెడ్లు ప్ర‌ధానంగా కీ రోల్ అయ్యారు.ఇక్క‌డ నియోజ‌క‌వ‌ర్గ రూపు రేఖ‌లు మారినందువ‌ల్లే గత రెండు ఎన్నికల్లోనూ ఇక్కడ టీడీపీ విజయం సాధిస్తూ వస్తోంది. 2009లో ఇక్కడ నుంచి టీడీపీ తర‌పున పోటీ చేసిన మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి… గత ఎన్నికల్లో సీనియర్‌ పార్లమెంటేరియ‌న్ రాయపాటి సాంబశివరావు వరుసగా టీడీపీ తర‌పున విజయాలు సాధిస్తూ వస్తున్నారు. టీడీపీ ఈ సెగ్మెంట్‌ పరిధిలో ఏకంగా న‌లుగురైదుగురు కమ్మ సామాజికవర్గానికి చెందిన వ్యక్తులకు అసెంబ్లీ సీట్లు ఇస్తోంది. టీడీపీ జిల్లా రాజకీయాల్లో సీనియర్లుగా ఉన్న స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌రావు, గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు జిల్లా టీడీపీ అధ్యక్షులు వినుకొండ ఎమ్మెల్యే జీవి. ఆంజనేయులు, పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ బాబు లాంటి వాళ్లంతా ఈ సెగ్మెంట్‌ పరిధిలోనే ఎమ్మెల్యేలుగా ఉండడంతో టీడీపీ ఇక్కడ బలంగా ఉంది. ఈ క్రమంలోనే వీళ్ల హవాకు చెక్‌ పెట్టాలన్నా, ఇక్కడ బలంగా ఉన్న కమ్మ సామాజికవర్గ ఓటర్లను చీల్చాలన్నా, నరసారావుపేట ఎంపీ అభ్యర్థిగా అదే వర్గానికి చెందిన వ్యక్తి అయితే కరెక్ట్‌ అని భావించిన జగన్‌ అటు సామాజిక పరంగానూ ఇటు ఆర్థిక కోణంలోనూ ఆలోచించి లావు శ్రీకృష్ణ దేవరాయులను గుంటూరు నుంచి నరసారావుపేటకు మార్చినట్టు స్పష్టం అవుతుంది.ఈ లోక్‌సభ సెగ్మెంట్‌ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో నిన్నటి వరకూ వైసీపీకి చిలకలూరిపేట, వినుకొండలో మాత్రమే కమ్మ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థులు ఉన్నారు. అయితే చిలకలూరిపేటలో మర్రి రాజశేఖర్‌ను తప్పించి బీసీ వర్గానికి చెందిన విడదల రజినీకి సమన్వయకర్త పగ్గాలు అప్పగించడంతో అక్కడ లావు ఎంట్రీకి క్యాస్ట్‌ ఈక్వేషన్లను బ్యాలెన్స్‌ చేసింది. గురజాల, మాచర్ల, న‌ర‌సారావుపేట‌లో రెడ్లు, వినుకొండలో కమ్మ, పెదకూరపాడు, సత్తెనపల్లిలో కాపు, చిలకలూరిపేటలో బీసీ ఇలా అందరికి ప్రాధన్యత కల్పించినట్లు అయ్యింది.చిల‌క‌లూరిపేట‌లో ప్ర‌ధాన పార్టీలు రెండు క‌మ్మ‌ల‌కే సీట్లు ఇస్తున్నాయి. దీంతో క‌మ్మ‌ల్లో మెజార్టీ వ‌ర్గాల‌తో పాటు బీసీలు టీడీపీకే ఓట్లేస్తుండ‌డంతో గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ ఇక్క‌డ టీడీపీయే గెలుస్తోంది. ఈ సారి బీసీ వ‌ర్గానికి చెందిన మ‌హిళ ర‌జ‌నీకి సీటు ఇవ్వ‌డంతో క‌మ్మ‌ సామాజిక వర్గం ఎలాగున్నా బీసీల ఓటు బ్యాంక్ టీడీపీకి భారీగా గండికొట్ట‌నుంది. ఈ స్ట్రాట‌జీతో జ‌గ‌న్ ఇక్క‌డ ర‌జ‌నీకి సీటు ఇచ్చారు. ఇప్పుడు ఆమె జెట్ రాకెట్ స్పీడ్‌తో దూసుకు వెళుతోంది.ఇక గుంటూరు వెస్ట్‌లో నిన్న‌టి వ‌ర‌కు ఇన్‌చార్జ్‌గా ఉన్న లేళ్ల అప్పిరెడ్డిని త‌ప్పించి మాజీ పోలీస్ అధికారి చంద్ర‌గిరి ఏసుర‌త్నంను నియ‌మించారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో రెడ్డి వ‌ర్గం ఓట‌ర్లు త‌క్కువే. క‌మ్మ‌, కాపుల ప్రాబ‌ల్యం ఎక్కువ‌. ఇక్క‌డ బీసీ వ‌ర్గానికి (వ‌డ్డెర‌) చెందిన ఏసుర‌త్నం నియ‌మించ‌డంతో ఆయ‌న అటు ఆర్థికంగా బ‌ల‌వంతుడు కూడా కావ‌డంతో అన్ని ఈక్వేష‌న్ల‌లో ఆయ‌నే గ‌ట్టి క్యాండెట్ అయ్యారు. రెడ్లు ఎలాగూ వైసీపీ వైపే ఉంటార‌ని…బీసీల‌ను ఆక‌ర్షించే క్ర‌మంలోనే ఈ మార్పు జ‌రిగింద‌ట‌. ఏదేమైనా జగన్‌ దూరదృష్టితో అన్నీ ఆలోచించే చేసిన ఈ మార్పులు ప్రధాన పార్టీ టీడీపీతో పాటు జనసేన వర్గాలు సైతం కాస్త డిఫెన్స్‌లోనే పడేసింది.

Related Posts