YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మావోయిస్టు కీలక నేత ఆరెస్టు

మావోయిస్టు కీలక నేత ఆరెస్టు
తూర్పు మన్యంలో మావోలకు ఎదురు దెబ్బ తగిలింది. చత్తీస్ ఘడ్, ఆంధ్ర సరిహద్దుల్లో ఇడుమా బెటాలియన్ డిప్యూటి కమాండర్ పోడియం ముడా ను పోలీసులు అరెస్ట్ చేసారు. సోమవారం నాడు కాకినాడలో ముడా ను జిల్లా ఎస్పీ విశాల్ గున్ని మీడియాకు చూపించారు. ఎస్పీ మాట్లాడుతూ 2014 లో చత్తీస్ ఘడ్ మంత్రి మహేందర్ కర్మా సహా మావోయిస్టు దాడుల్లో 116 మంది పోలీసుల మృతికి ముడా కారకుడని అన్నారు. ముడా చత్తీస్ ఘడ్ మావోల కీలక గ్రూప్ కమాండర్ ఇడుమా కు ప్రధాన అనుచరుడు. ప్రజాప్రతినిధులు, పోలీసులు, సిఆర్పీఎఫ్ బలగాల పై దాడుల కేసులో కీలక నిందితుడని వెల్లడించారు.  ముడా పాల్గోన్న దాదాపు పదిహేను దాడుల్లో మొత్తం 198 మంది మృతి చెందారు. ముడా నుంచి 20డిటోనేటర్లు, 20 జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నారు. 2005 లో మావోయిస్టు లో చేరిన ముడా అంచలంచేలుగా సెక్షన్ కమాండర్ స్థాయికి చేరుకున్నాడు. 

Related Posts