YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

వచ్చేస్తున్నాయి..మడతేసే ఫోన్‌లు

వచ్చేస్తున్నాయి..మడతేసే ఫోన్‌లు

అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్‌ఫోన్లను చూశాం! చేతిలో ఇమిడిపోక బ్యాగుల్లో పెట్టుకుని తిరిగే ట్యాబ్లెట్‌లు చూశాం. అచ్చంగా చిన్న ల్యాప్‌టాప్ లాంటి ట్యాబ్‌లూ చూశాం! మడతేసి చేతికి బ్రాస్లెట్‌లా పెట్టుకునే ఫోన్‌లు, పుస్తకంలా మడిచే ట్యాబ్‌లు వచ్చేస్తున్నాయి తెలుసా? కావాలంటే లెనోవో పరిచయం చేయనున్న ‘ప్రోటోట్కెప్ ఫోన్’, ఫోలియో ట్యాబ్‌లను చూడండి. ముందుగా సీంగా వ్యవహరిస్తున్న ఫోన్ విషయానికొస్తే... దీన్ని ఫొటోలో మాదిరిగా సాధారణ ఫోనులా వాడొచ్చు.

ట్రెండీగా మడతపెట్టి బ్రాస్లెట్‌లా మణికట్టుపై ధరించొచ్చు. ప్రస్తుతం నమూన దశలో ఉంది. ఇక ‘ఫోలియో’ ట్యాబ్‌ను ఫోల్డ్ చేసి రెండుగా మార్చేయవచ్చు. అంటే చిత్రంలో మాదిరిగా పుస్తకంలా మారిపోతుందన్నమాట. ఒకటే స్క్రీన్ రెండుగా విడిపోతుంది. ఒకవైపు తెరను కాల్స్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. మరోవ్కెపు తెరను కెమెరాలా వాడుకోవచ్చు. అయితే ఈ రెండు ఎప్పుడు మార్కెట్‌లోకి వస్తాయో లెనోవో ఇంకా స్పష్టం చేయలేదు.

Related Posts