అవనిగడ్డ మండలంలోని యడ్ల లంక , వేకనూరు లంక గ్రామాలలో ఉన్న మామిడి తోటలు ఉప్పు నీటి వలన ఫలసాయం ఇవ్వకపోవటం, హార్టికల్చర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు MRO గారి ఆధ్వర్యంలో సర్వే పూర్తి చేయటం రిపోర్టు MRO గారి ఆఫీస్ కు పంపడం జరిగింది. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు మైక్రో ఇరిగేషన్ క్రింద ఈ ప్రాంతంలో మైక్రో ఇరిగేషన్ టెక్నిక్స్ ద్వారా మరలా ఈ మామిడి తోటలను రక్షించటానికి తగు సహాయం చేయనున్నారు నిధులు కూడా తయారుగా ఉన్నాయి. దయచేసి సర్వే రిపోర్ట్ ను ఏపీఐడీసీ వారికి త్వరగా పంపినట్లయితే ప్రభుత్వం నుండి తగిన నిధులను తీసుకురావడం జరుగుతుంది. ఈ మామిడి రైతులకు సాగునీరు అందజేయడంలో ప్రభుత్వం తగు సహాయం చేస్తుంది. కొంచెం త్వరగా ప్రతిపాదనలను ఏపీఐడీసీ కి పంపవల్సిందిగా మనవి.