YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

పూరి జగన్నాథ్ 'మెహబూబా' టీజర్

పూరి జగన్నాథ్ 'మెహబూబా' టీజర్

ఆకాశ్ పూరీ హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న చిత్రం 'మెహబూబా'. ఇప్పటికే ఫస్ట్‌లుక్‌లతో ఆకట్టుకున్న ఈ చిత్రం నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. 1971లో భారత్-పాక్ యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. అప్పటి పరిస్థితులకు తగ్గట్లుగా పూరీ తెరకెక్కించిన విజువల్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సందీప్ చౌతా అందించిన బ్యాక్‌గ్రౌండ్ మెయిన్ అస్సెట్‌గా నిలిచింది.

ఇక ఈ చిత్రంలో ఆకాశ్ పూరీ సరసన నేహా శెట్టి హీరోయిన్‌గా నటించింది. పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్‌పై పూరీ జగన్నాథ్ స్వీయ దర్శకనిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సందీప్ చౌతా సంగీతాన్ని అందించాడు. వేసవి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Posts