YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

భిలాయి స్టీల్ ప్లాంట్ లో పేలుడు 9 మంది దుర్మరణం

భిలాయి స్టీల్ ప్లాంట్ లో పేలుడు 9 మంది దుర్మరణం
చత్తీస్‌గఢ్‌లోని భిలాయి స్టీల్ ప్లాంట్‌లో సంభవించిన భారీ పేలుడులో 9 మంది మృతి చెందగా, మరో 11 మంది గాయపడ్డారు. బొగ్గును మండించే ప్రాంతం దగ్గర్లోని పైప్‌లైన్‌లో ఈ పేలుడు సంభవించింది. వెంటనే పోలీసులు, ఇతర సహాయ సిబ్బంది ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లారు. గాయపడిన వాళ్లను స్థానిక ఆసుపత్రికి తరలించారు. 9 మంది మంటల్లో పూర్తిగా కాలిపోయారని, గాయపడిన 11 మందిలోనూ చాలా మంది పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని దుర్గ్ రేంజ్ ఐజీ జీపీ సింగ్ వెల్లడించారు. ఈ ప్లాంట్‌ను జాతీయ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) నిర్వహిస్తున్నది.ఈ ఏడాది జూన్‌లోనే భిలాయి స్టీల్ ప్లాంట్‌లో అత్యాధునిక యూనిట్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. 2014లోనూ ఫర్నేస్‌లో సంభవించిన పేలుడు ధాటికి ఇదే స్టీల్ ప్లాంట్‌లో ఆరుగురు మృతి చెందారు. దేశంలోని అన్ని స్టీల్ ప్లాంట్స్ కంటే భిలాయిలోనే ప్రపంచస్థాయి అత్యుత్తమ స్టీల్ తయారవుతున్నదని సెయిల్ చెప్పింది. ఏడాదికి 3.153 మిలియన్ టన్నుల స్టీల్ ఇక్కడ ఉత్పత్తి అవుతున్నది.

Related Posts