ఐక్య రాజ్య సమితిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడింది ప్రభుత్వ పోర్టల్ లో ఎందుకు పెట్టలేదు. జీరో బేస్డ్ వ్యవసాయం పేరుతొ 16,600 కోట్ల ఎం ఓ యు సంగతేంటి. ప్రజలకు వాస్తవాలు చెప్పండని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ ఏరసారు. మంగళవారం అయన మీడియాతో మాట్లాడారు. ఐక్య రాజ్య సమితిలో ఎపి సీఎం చంద్రబాబు మాట్లాడినట్లు చెబుతున్నారని అయితే ఎపి ప్రభుత్వానికి సంబంధించిన పోర్టల్ లో ఎందుకు ఈ విషయం ప్రస్తావించలేదని అడిగారు. ఐదు రోజులపాటు జరిగిన అమెరికా టూర్ లో ఎక్కడా ఐక్య రాజ్య సమితి విషయం లేదన్నారు. సెప్టెంబర్ 23న నోరి దత్తాను కలిసినట్లు, 24న భారత అంబాసిడర్ అక్బరుద్దీన్ తో భేటీ, జీరో బేస్డ్ నేచురల్ వ్యవసాయం గురించి చర్చించినట్లు, 25న రీసెర్చ్ సెంటర్, 26న న్యూయార్క్ లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు ఉందని ఆయన చెప్పారు. ఇక జీరో బేస్డ్ వ్యవసాయం పేరుతొ 16,600 కోట్ల ఎం ఓ యు చేసుకున్నట్లు చెబుతున్నారని అయితే జీరో బేస్డ్ అంటూ ఇన్నివేల కోట్లు ఎందుకు ఇస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. దీనిపై బెంగుళూరుకు చెందిన లియో సుల్తానా ఎన్విరాన్ మెంట్ టీమ్ అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం నుంచి సమాధానం లేదని, ఆర్ టి ఐ యాక్ట్ కింద అడిగితె సెక్షన్ 8ప్రకారం ఇది చెప్పకూడని విషయం గా పేర్కొనడం శోచనీయమని ఆయన అన్నారు. కేవలం రక్షణ శాఖకు చెందిన విషయాలనే ఇలా సెక్షన్ 8కింద చూస్తారని అయితే జీరో బేస్డ్ వ్యవసాయంలో కూడా సెక్షన్ 8ప్రకారం వివరాలు ఇవ్వలేమని చెప్పడం వింతగా ఉందన్నారు.