జనసేన.. టీడీపీ ఓట్లను చీల్చుతాడు. మన ఓట్లు మనకే ఉన్నాయి. ఎటుచూసినా. సైకిల్‌కు పంక్సర్ అవ్వటం ఖాయం. ఇక మనదే సీటు. అదేనండీ సీఎం ఫేటు. అనుకుంటూ.. తెగ పీలయ్యి.. ఉబ్బితబ్బిబైన వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డికి ఓదార్పు యాత్రలో వాస్తవం తెలుస్తున్నట్టుంది. టీడీపీ ఓట్లతోపాటు తన పార్టీ సీట్లకు పవన్ ఎసరు పెడుతున్నట్టుగా గుర్తించినట్టున్నాడు. ఇప్పుడు.. దాన్ని ఆచరణలో పెట్టేందుకు నియోజకవర్గాల సమన్వయకర్తలను మార్చే పనిలో బిజీగా ఉన్నాడు.. దాదాపు ఏడెనిమిదేళ్లుగా.. వైఎస్సార్‌ను నమ్ముకుని.. ఆ తరువాత కొడుకు పార్టీలోకి వచ్చిన నేతలకు.. ఇప్పుడు సీటు ఉంటుందా.. సారీ గురూ.. ఈ సారి కి సర్దుకుపోండీ. మన పార్టీ గెలిస్తే. మీకు ఏదొఒక నామినేటెడ్ పదవి ఇస్తాలే అంటూ చెబుతాడనే బెంగ పట్టుకుందంట. దీంతో ఏ పార్టీలోకి వెళితే తమకు కాలం కలసివస్తుంది. నాలుగు ఓట్లు పడతాయనే ఆలోచనలో కొందరు నేతలు ఇప్పటికే సర్దుబాటు చర్యలకు సిద్ధమయ్యారట. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకూ అందరిలోనూ వైసీపీలో ఇది అంతర్గతంగా సాగుతున్న చర్చ. అయితే.. ఈ సారి.. అమ్మ విజయమ్మ.. బాణం షర్మిలమ్మకు అసెంబ్లీ సీటా.. పార్లమెంట్ సీటా అనేది ఇప్పటికీ కొలిక్కిరాలేదట. పైగా 2014లో విశాఖలో ఎదురైన పరాభవంతో విజయమ్మ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావటం పట్ల అయిష్టత వెలిబుచ్చారట. షర్మిల కూడా.. రాజకీయాల్లో తన వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేలా కామెంట్స్ తన కుటుంబ జీవితంపై ప్రభావం చూపుతాయని ఆందోళన చెందుతున్నారట.
ఈ లెక్కన.. కులాల ప్రాతిపదికన.. ఎవర్ని పక్కన చేర్చుకోవాలి. ఇంకెవర్ని పక్కకు నెట్టాలనేది ఉంటుందంటూ ఇప్పటికే జగన్ క్షేత్రస్థాయిలో కేడర్‌కు ఉప్పందించారట. అందుకే.. సికాకుళం, నర్సాపురం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నర్సరావుపేట, విశాఖపట్టణం వంటి హార్ట్‌కోర్ ఎంపీ స్థానాల్లో కొత్తవారికే ఖాయమంటున్నారట. పైగా.. బీజేపీతో రహస్య ఒప్పందం మేరకు.. కొన్నిచోట్ల తమ పార్టీ నుంచి డమ్మీ అభ్యర్థులను రంగంలోకి దింపి.. కాషాయ జెండాకు వత్తాసు పలికేందుకు ఇప్పటికే ఒప్పందం కుదిరిందంటూ సోషల్‌మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. దీంతో వైసీపీ జెండా మోసిన నేతలకు సీటు గ్యారంటీ లేదనే బెంగ పట్టుకుందంట… అప్పుచేసి మరీ లక్షలు కుమ్మరించిన డబ్బుకు న్యాయం జరుగుతుందా అనే అనుమానం కూడా వేదిస్తుందట. ఏమైనా.. పవన్ దెబ్బకు జగన్ రూటు మార్చుకోవటం ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణలకు తెరలేపింది. ఈ లెక్కన. టీడీపీ కూడా అభ్యర్థులను మార్చాల్సి వస్తుందేమో అనేది ఆ పార్టీ నేతల ఆందోళన. నిజంగానే పవన్ అన్నట్టు తాను గెలవకపోయినా.. పక్కోడిని మాత్రం ఓడించగలనంటూ సవాల్ విసిరాడు. ఇప్పుడదే చేసి చూపుతారనేది విశ్లేషకుల అంచనా