YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వాణిజ్యం

భారతీయ ఇన్వెస్టర్లకు ఐటీ నోటీసులు

భారతీయ ఇన్వెస్టర్లకు ఐటీ  నోటీసులు

- దేశవ్యాప్తంగా సుమారు 350 కోట్ల డాలర్ల క్రిప్టో లావాదేవీలు

- సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరక్ట్ ట్యాక్సెస్ చైర్మన్ సుశీల్ చంద్ర

బిట్‌కాయిన్ లాంటి క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడులు పెట్టిన సుమారు లక్ష మంది భారతీయ ఇన్వెస్టర్లకు ఆదాయపన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరక్ట్ ట్యాక్సెస్ చైర్మన్ సుశీల్ చంద్ర తెలిపారు. వర్చువల్ కరెన్సీ వినియోగంపై సీబీడీటీ దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించిందన్నారు.

గత 17 నెలల్లో దేశవ్యాప్తంగా సుమారు 350 కోట్ల డాలర్ల క్రిప్టో లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. చాలా మంది క్రిప్టోలో ఇన్వెస్ట్ చేశారని, కానీ వాళ్లు ఎవరూ ఆ అంశాన్ని తమ ఐటీ ఫైలింగ్‌లో చూపించలేదని, ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా వచ్చిన ఆదాయంపై పన్ను కట్టలేదని ఐటీ శాఖ అధికారులు తెలిపారు.

Related Posts