కళింగపట్నానికి 310 కి.మీ, గోపాలపూర్ కు 370 కి.మీ దూరంలో తిత్లీ తుపాను కేంద్రీకృతం అయింది. గురువారం పు ఉదయానికి శ్రీకాకుళానికి 60 కి.మీ దూరంలో కేంద్రీకృతమయ్యే అవకాశం వుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. ఈ ప్రభావంతో ఉత్తరకోస్తాకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. తీరం వెంబడి గంటకు 120 నుంచి 145 కి.మీ వేగం వరకు ఈదురు గాలులు వీచే అవకాశం వున్నాయి. మత్స్యకారులను వేటకు వెళ్ళరాదని విపత్తుల శాఖ హెచ్చరికలు చేపింది. ఉత్తరకోస్తా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది.