దివంగత ఎమ్మెల్యే సర్వేశ్వర రావుకు నివాళులు మంత్రి నారా లోకేష్ అర్పించారు. తరువాత అయన కిడారి కుటుంబసభ్యులను పరామర్శించారు. లోకేష మట్లాఆతూ ఒక కుటంబ సభ్యుడిని కోల్పోయాం. ప్రతీ క్షణం గిరిజనుల అభివృద్ధి కోసం ఆలోచించిన వ్యక్తి కిడారి అని అన్నారు. వ్యవసాయ కుటుంబం లో పుట్టి,ఒక గిరిజనుడిగా తాను పడిన కష్టాలు గిరిజనులు పడకూడదు అన్న ఆశయంతో పని చేసారు. అరకు అభివృద్ధి కోసం ఈ రెండున్నర ఏళ్లల్లోనే సుమారుగా 450 కోట్ల నిధులు కేటాయించాం . నన్ను ఎప్పుడు కలిసినా మా ప్రాంత అభివృద్ధి కి సహకరించాలి అని అడిగేవారు. చివరి సారిగా ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మేము ఇద్దరం కలిసి భోజనం చేసాం. ఆయన 8 గ్రామాలకు రోడ్లు మిగిలిపోయాయి...అవి కూడా పూర్తి చేస్తే అరకు లో రోడ్ల సమస్య ఉండదు అని చెప్పారు. నేను చైనా పర్యటన లో ఉండగానే ఈ ఆఫీస్ లో వచ్చిన ఫైల్ క్లియర్ చేసాను...ఆ ఫైల్ చూసి ఆయన చివరి సారిగా నాతో మాట్లాడిన మాటలు గుర్తొచ్చి ఎంతో బాధపడ్డాను. నిరంతరం గిరిజనుల అభివృద్ధి కోసం కృషి చేసిన వ్యక్తి ని దారుణంగా హత్య చేసారు... మావోయిస్టుల చర్యను ఖండిస్తున్నాను. ఆయన మనతో లేక పోయినా, ఆయన ఆశయాలను మేము నెరవేరుస్తాం. అరకు లో మిగిలిన అభివృద్ధి ని పూర్తి చేస్తాం.కిడారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని అన్నారు. హత్య నేపద్యంలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల పై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా నేను రాజకీయాలు మాట్లాడటానికి రాలేదు,కుటుంబ సభ్యుడిని కోల్పోయాం...వారికి అండగా ఉండటానికి మాత్రమే ఇక్కడికి వచ్చానని వ్యాఖ్యానించారు.