YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బిందు సేద్యానికి ప్రధాన్యత : చంద్రబాబు నాయుడు

బిందు సేద్యానికి ప్రధాన్యత : చంద్రబాబు నాయుడు

బీజేపీతో విభేదించక మునుపు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా,  విభజన హామీలు నెరవేర్చాలని టీఆర్ఎస్ పార్టీ కూడా కోరింది. ఎప్పుడైతే ఎన్డీయే  నుంచి బయటకు వచ్చామో అప్పటినుంచి బీజేపీ రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించాడానికి ప్రయత్నాలు చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు.  బుధవారం నాడు అయన జిల్లాల్లో భూరవానితిప్పలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రధాని  నరేంద్ర మోదీ కంటే నేను రాజకీయాల్లో సీనియర్ ని. ఎన్నో రాజకీయ పార్టీలు, ప్రత్యామ్నాయ రాజకీయాలను టీడీపీ ఏర్పాటు చేసింది.  తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ తెలుగు దేశం.  ఎక్కడ తెలుగు జాతి, ఉన్నా, తెలుగు ప్రజలు ఉన్నా అందరినీ ఆదుకుంటుందని అన్నారు.   కష్ట కాలంలో నన్ను ముఖ్యమంత్రిగా విశ్వాసంతో ఎన్నుకున్నారు.  రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయింది.  నేను హెలికాఫ్టర్లో వస్తుంటే ఎక్కడ చూసినా రిజర్వాయర్లు ఉన్నాయంటే నా కల సాకారమైందనిపిస్తోంది. గతంలో అనంతపురం జిల్లాలో ఎక్కడ చూసినా పంటలు పండని భూములు, నీరు లేని పంటలు , విచారకరమైన వాతావరణం ఉంది.  కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా చెట్లు కనిపిస్తున్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది.  పెండింగ్ ప్రాజెక్టులు సైతం పూర్తి చేస్తా.  బిందు సేద్యానికి ప్రాధాన్యతినిస్తానని అన్నారు. 

 ఒకవైపు ప్రకృతి సమస్యలు, మరోవైపు ప్రతిపక్షాల సమస్యలు ఉన్నాయి.. బీజేపీ టీఆర్ఎస్, పవన్, జగన్ పార్టీలని ఉపయోగించుకుంటున్నాయి.  మీ అండ, సహకారం ఉంటే కొండనైనా ఢీకొనే శక్తి తెలుగుదేశానికి ఉంది.  ప్రజలు మంచిని ప్రోత్సహించి, సమర్థించాలి, ఆదరించాలి అప్పుడే మనందరం ఆనందంగా ఉంటాం.  స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాసులు ఎప్పటికప్పుడు కొత్త సమస్యలు నా దృష్టికి తెచ్చి పరిష్కారమయ్యేలా చూస్తున్నారు.  భైరవానితిప్ప ప్రాజెక్టు నుండి దుమ్మగట్ట మండలంలో కొత్తపల్లి, రంగసముద్రం, కలుగోడు, గౌనికుంట, గూనబావి, భూపసముద్రం, రాయదుర్గ మండలంలో మల్లాపురం, దొడగట్ట వంటి గ్రామాలలో ఉంటే చెరువులన్నింటికీ నీళ్లివ్వాలని, బిందు సేద్యానికి ప్రాధాన్యతనివ్వడానికి రూ. 200 కోట్లు అవుతుంది.. వీటిని శాంక్షన్ చేస్తున్నాం.  హంద్రీనీవా సుజలస్రవంతి 36వ ప్యాకేజీ కింద నిర్మితమవుతున్న అవలగట్ల బ్రాంచి కెనాల్ డి హీరేహల్ మండలానికి పొడిగించాలి.. దీనివల్ల తమ్మెపల్లి, మెరడి, ఎమ్మనుమాపురం వంటి గ్రామాల్లో 8వేల ఎకరాలకు రూ. 80 కోట్లతో శాంక్షన్ చేస్తున్నాం.  తుంగభద్ర ఎగువ కాలవ పరధిలో లక్షా 86 వేల ఎకరాలకి బొమ్మనాడులో ఉంతకల్లు గ్రామం వద్ద నాలుగు టీఎంసీల నీరు ఉంచడానికి రిజర్వాయర్కి డీపీఆర్ తయారు చేయడానికి రూ. 5 కోట్లు అవుతుంది.. అది కూడా శాంక్షన్ చేస్తున్నామని అన్నారు. డీహీరేహల్లో కొత్తగా చెరువు కావాలంటే రూ. 4 కోట్లు అవుతుంది.  రాయదుర్గం నియోజకవర్గానికి 2వేల ఇళ్లు కావాలి.   బొమ్మన హల్ కళ్లుదేవర రహదారికి రూ. 12 కోట్లు, పొళ్తూరు, కళ్లు దేవల,హళ్లిక రహదారికి రూ. 6 కోట్లు.. ఉరవకొండ కనేకల్ రహదారికి రిపేర్ చేయాలని కళ్యాం, సీ. రంగాపురం రహదారికి కావాలని అడిగారు. వీటికి రూ.450 కోట్లు ఖర్చు అవుతుంది.  వీటికి డబ్బులు శాంక్షన్ చేస్తాం.  టీడీపీ ప్రభుత్వం ధృడ సంకల్పంతో ముందుకు పోతోందరి అన్నారు. మీకు ఇబ్బంది లేకుండా తాత్కాలికంగా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం.  దీర్ఘకాలంగా మీకు సంపద సృష్టించడానికి అన్ని విధాలుగా పరిశ్రమలు, నీళ్లు ఇస్తున్నాం.   నేను తీసుకున్నా ప్రణాళికలు రాబోయే రోజుల్లో అనేక మార్పులు మీ జీవన ప్రమాణంలో వస్తాయి.  రాజకీయాల్లో ఉంటే 5 సంవత్సరాలకి ఒకసారి పరీక్షలు రావాలి.. ఎన్నికల్లో పాసైతేనే మీ పనులన్నీ పూర్తవుతాయి. ప్రతిపక్షాలు ఏ మాత్రం ఏమార్చినా సమాజానికే ఇబ్బందిగా మారుతుంది.  ఇప్పుడిప్పుడే పరిపాలన గాడిలో పెట్టాం.  టెక్నాలజీని ఉపయోగించాం.. పనులు తొందరగా కావడానికి జవాబుదారితనంతో పనిచేస్తున్నామన్నారు.  ఈ నెలలో ప్రభుత్వం మీద 80 శాతం  సంతృప్తి కలిగింది.  ఫోన్ ద్వారా ప్రజల సమస్యలని తెలుసుకోవడం ప్రపంచంలో ఎక్కడా లేదు.  ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రియల్ టైం గవర్నెన్స్ తీసుకొచ్చాం. ఆఫీసు నుంచి ప్రతినిత్యం 15 లక్షల ఫోన్ల ద్వారా మీ సమస్యలు తెలుసుకుంటున్నాం.  ఈ రోజు కలెక్టర్లకి చేసిన సన్మానం ప్రభుత్వానికి చేసిన సన్మానంగా భావిస్తున్నాను.  లక్ష పాండ్స్ తవ్వారు, 5 లక్షల ఎకరాలలో బిందు సేద్యం తీసుకొచ్చాం– టీడీపీది నీతివంతమైన పాలన.  ఒక్క ఫోన్ ద్వారా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోవచ్చని చంద్రబాబు అన్నారు. 

Related Posts