30 సంవత్సరాల పాటు తనకు రాజకీయాల్లో కొనసాగాలని ఉందని.. ఇందుకోసం అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకుంటానని, ప్రతి ఇంట్లో చనిపోయాక తన తండ్రి ఫోటో పక్కన తన ఫోటో ఉండేలా పాలన చేస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అనంతపరం పట్టణంలో భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభకు భారీగా జనసందోహం హాజరయ్యారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబుకు వ్యవసాయంపై కేంద్ర హోంమంత్రి అవార్డు ఇస్తున్నారని… ఆయనకు అవార్డు ఇవ్వడం అంటే తాగి వచ్చి భార్యను కొట్టే భర్తకు ఉత్తమ భర్త అవార్డు ఇవ్వడమేనని ఎద్దేవా చేశారు. అన్ని వర్గాల ప్రజలను అబద్ధాలతో మోసం చేస్తున్నుందుకు చంద్రబాబుకు ఉత్తమ ఛీటర్ అవార్డు ఇవ్వాలని పేర్కొన్నారు.ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని ఆంబులెన్సులు వదలడం లేదు. ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా వరుసగా ఆయన నిర్వహించిన మూడు సభల్లోకి ఆంబులెన్సులు రావడం గమనార్హం. మొదటగా విజయనగరం జిల్లాలోనే నెల్లిమర్లలో సభలో జగన్ మాట్లాడుతుండగా… ఓ గర్భిణి స్త్రీతో ఓ ఆటో సభలోకి వచ్చింది. దీంతో జగన్ ప్రజలకు పక్కకు తప్పుకోవాలని కోరి సదరు ఆటోకు దారి ఇచ్చాడు. దీంతో పాటు 108 లు పనిచేయక ఆటోల్లో వెళ్లాల్సి వస్తుందని జగన్ ఆరోపించారు. చీపురుపల్లి నియోజకవర్గంలో జరిగిన తర్వాత సభలో జగన్ మాట్లాడుతుండగా 108 ఆంబులెన్స్ వచ్చింది. అయితే ఆ ఆంబులెన్సులో ఎవరూ లేరని, కేవలం 108లు పనిచేస్తున్నాయని చెప్పడానికి ఇలా సభలోకి ఖాళీ 108ని పంపించారని జగన్ ఆరోపించి.. దానికి కూడా దారి ఇప్పించారు. ఇక ఇవాళ గజపతినగరంలో జరిగిన సభలోనూ జగన్ మాట్లాడుతుండగా ఓ ప్రైవేటు ఆంబులెన్సు సభలోకి వచ్చింది. దీంతో జగన్ మళ్లీ ప్రజలను బతిమిలాడి ప్రజల్లో నుంచి దారి కల్పించి ఆంబులెన్సును పంపించారు. మొత్తానికి విజయనగరం జిల్లాలో వరుసగా మూడు సభల్లోనూ ఇటువంటివే సంఘటనలే జరగడం గమనార్హం.