
‘రేషన్’ అను బ్రాండ్ పేరు మీద సరుకులు పంపిణీ చేయడానికి జిల్లాకు 300 మంది పంపిణీదారులు (డిస్ట్రిబ్యూటర్స్) కావాలని ప్రచారం చేస్తూ ఒక్కోక్కరి దగ్గర నుంచి సూమారు రూ. లక్ష వరకూ వసూలు చేస్తున్నట్లు తెలియవచ్చింది.ఈ సందర్భంగా ప్రజలకు ‘రేషన్’ అను బ్రాండ్ పేరు గల వస్తువులు ఏవి పౌరసరఫరాల శాఖకు చెందినవి కావు. దీనికి ప్రజా పంపిణీ వ్యవస్థకు కాని మరి ఏ ఇతర ప్రభుత్వ సంస్థకు కాని సంబంధం లేదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమీషనర్ బి రాజశేఖర్ నేడొక ప్రకటనలో తెలిపారు.‘రేషన్’ అను పేరు చూసి మోసపోవద్దని ప్రజలకు తెలియజేశారు. ఆ బోగస్ ‘రేషన్’ చేపడుతున్న నియమకానికి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. ఈ బోగస్ వ్యక్తుల వలలో పడి మోసపోవద్దని కమీషనర్ ప్రజలను కోరారు.