YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జనసేనలోకి మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌

జనసేనలోకి మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌
మాజీ స్పీకర్‌, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత నాదెండ్ల మనోహర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఆయన రాజీనామా చేశారు.జనసేన పార్టీలో చేరనున్నారు.ఈ మేరకు ఈ విషయాన్ని గురువారం ఆయన ధ్రువీకరించారు. శుక్రవారం ఉదయం తిరుమలలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ను కలువనున్నారు. వారిద్దరూ కలిసి శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం జనసేనలో చేరుతున్న విషయాన్ని నాదెండ్ల మనోహర్‌ అధికారికంగా ప్రకటించనున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో కీలక నేతగా ఉన్న మనోహర్‌ ఈ నిర్ణయం తీసుకోవడం ఆ పార్టీకి కచ్చితంగా షాకేనని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఇప్పటివరకు జనసేనలో ఇతర పార్టీల నుంచి కీలక నేతలెవరూ చేరలేదు. మనోహర్‌ రాకతో ఆ పార్టీ కేడర్‌లో మరింత ఉత్సాహం నెలకొంటుందని భావిస్తున్నారు.2014లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి తర్వాత ఆ పార్టీలోని ముఖ్య నేతలంతా పార్టీని వీడినప్పటికీ మనోహర్ మాత్రం ఇప్పటివరకూ అదే పార్టీలో కొనసాగుతూ వచ్చారు. గుంటూరు జిల్లా తెనాలి నుంచి రెండు సార్లు శాసనసభకు ఎన్నికైన ఆయన... 2011లో అప్పటి స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో స్పీకర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న ఆయన రాజకీయ భవిష్యత్‌పై అనేక ఉహాగానాలు వచ్చాయి. ఓ దశలో తెంలగాణ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తారని కూడా ప్రచారం జరిగింది. అయితే ఆయన అనూహ్యంగా జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నారు. పవన్, మనోహర్ మధ్య ఎప్పటి నుంచో స్నేహ సంబంధాలు ఉన్నాయని... ఇద్దరి రాజకీయ ఆకాంక్షలు కూడా ఒకటే కావడంతో జనసేనతో కలిసి అడుగులు వేయాలని నిర్ణయించుకున్నారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. నవతరం రాజకీయాలే లక్ష్యంగా మనోహర్‌ జనసేనలో చేరుతున్నారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. నాదెండ్ల మనోహర్ చేరిక రాజకీయంగా పార్టీకి లాభం చేకూరుతుందని జనసేన అంచనా వేస్తోంది.

Related Posts