YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రఫెల్‌ ఒప్పందం‌ పక్కా అవినీతి కేసు ప్రధాని మోదీపై దర్యాప్తు చేపట్టాలి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ డిమాండ్‌

 రఫెల్‌ ఒప్పందం‌ పక్కా అవినీతి కేసు         ప్రధాని మోదీపై దర్యాప్తు చేపట్టాలి          కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ డిమాండ్‌
వివాదాస్పదంగా మారిన రఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం‌పై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి విరుచుక పడ్డారు. ఇది పక్కాగా అవినీతి కేసు అని, మోదీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.ప్రధాని మోదీపై దర్యాప్తు చేపట్టాలని ‌ డిమాండ్‌ చేశారు.  భారత్‌ ఇష్ట ప్రకారమే రిలయన్స్‌ డిఫెన్స్‌ను భాగస్వామిగా ఎంపిక చేసుకున్నామని ఫ్రాన్‌్ కు చెందిన డసో కంపెనీ తెలిపినట్లు ఫ్రాన్స్‌ మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో రాహుల్‌ మళ్లీ తీవ్ర విమర్శలకు దిగారు. గురువారం  దిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడిన రాహుల్‌ ఇంత జరుగుతున్నాఇప్పటికీ ఆయన నోరు విప్పడం లేదన్నారు. ‘ప్రధాని అవినీతికి పాల్పడ్డారని పక్కాగా తెలుస్తోంది. నేను మళ్లీ చెప్తున్నాను భారత ప్రధాని అవినీతిపరుడు. అయితే ఆయన అవినీతిపై పోరాటం గురించి ప్రచారం చేయడం బాధాకరం’ అని రాహుల్‌ ఆరోపించారు.మోదీ దేశ ప్రధాని కాదని, అనిల్‌ అంబానీ ప్రధాని అని ఆరోపించారు. గతంలో ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు హోలన్‌ చెప్పినట్లుగానే ఇప్పడు డసో అధికారి కూడా చెప్తున్నారని అన్నారు. ఇప్పుడు కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ ఒప్పందంలో తప్పులను కవర్‌ చేసేందుకే ఫ్రాన్స్‌ పర్యటనకు వెళ్తున్నారని ఆరోపణలు చేశారు. అవినీతి రక్షణ రంగంలో మాత్రమే కాదని.. ఇతర రంగాల్లో జరిగిన ఒప్పందాల్లో కూడా జరిగిందని రాహుల్‌ ధ్వజమెత్తారు.భారత్‌-ఫ్రాన్స్‌ల మధ్య యుద్ధవిమానాల కొనుగోలుకు కుదుర్చుకున్న ఒప్పందంపై తీవ్ర వివాదం నెలకొన్న సగంతి తెలిసిందే. అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ డిఫెన్స్‌ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోవాలని భారత్‌ చెప్పిందని ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు హోలన్‌ వెల్లడించడంతో దుమారం రేగింది. భాగస్వామి ఎంపిక ఫ్రాన్స్‌ డిఫెన్స్‌ కంపెనీ డసోదే అని భారత్‌ చెప్తోంది. కాగా తాజాగా రఫేల్‌ ఒప్పందం కుదుర్చుకునేందుకే ఆఫ్‌సెట్‌ భాగస్వామిగా రిలయన్స్‌ డిఫెన్స్‌ను ఎంచుకోవాల్సి వచ్చిందని డసో ఏవియేషన్‌ వెల్లడించినట్లు ఫ్రాన్స్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే డసో మాత్రం తాము స్వచ్ఛందంగానే రిలయన్స్‌ గ్రూప్‌ను ఎంచుకున్నామని ఓ ప్రకటనలో వెల్లడించింది.

Related Posts