భారతీయులకు ఎంతో ప్రవితమైన గంగా నదిని ప్రక్షాళన చేయాలంటూ.. 109 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ పర్యావరణవేత్త జేడీ అగర్వాల్(86) కన్నుమూశారు. జూన్ 22 నుంచి నిరాహార దీక్షకు దిగిన అగర్వాల్‌ను ఉత్తరఖాండ్ పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. నిన్న ఆయనకు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో వెంటనే అగర్వాల్‌ను రిషికేష్‌లోని ఏయిమ్స్‌కు తరలించారు. కానీ ఆయన ప్రాణాలను మాత్రం కాపాడుకోలేకపోయారు. గంగా ప్రక్షాళన చేపట్టాలంటూ.. ఎన్నో ఏళ్లుగా ప్రధాని మోదీ ప్రభుత్వానికి ఆయన ఏకరువు పెడుతూనే ఉన్నారు. అయినప్పటికీ, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదు. దీంతో జూన్ నుంచి ఆయన మరోసారి నిరాహార దీక్ష చేపట్టారు. గంగా ప్రక్షాళనపై 2008 నుంచి ఆయన నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికి ఇది ఆరోసారి. అగర్వాల్, స్వామి జ్ఞాన్ స్వరూప్ సనంద్‌గా కూడా ప్రసిద్ధి. జేడీ అగర్వాల్ మృతిపై పలువురు ప్రముఖలు నివాళులర్పిస్తున్నారు. జేడీ అగర్వాల్ గంగా కోసం ప్రాణాలను అర్పించారని ట్వీట్లు చేస్తున్నారు