గుడివాడ ఏరియా మెడికల్ హాస్పిటల్ లో ప్రభుత్వం వారు కొత్త భవనాన్ని అన్ని వసతులతో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేశారు. పాత భవనం లో ఉన్న వసతులు కొత్త భవనం లోకి మారిన తర్వాత పాత భవనం క్రింద ఫ్లోర్ ను బాగు చేయాలి.అలాగే ఇంటర్నల్ రోడ్లు, మార్చురీ, లిఫ్ట్ సదుపాయాల గురించి ప్రతిపాదించాలి. కొత్త భవనం ప్రారంభోత్సవం జరగాల్సి ఉంది. ఈ భవనంలో మేనేజ్మెంట్ పద్ధతులను ఇంకా ఫైనలైజ్ చేయాలి.
కావున అధికారులు ఒకసారి గుడివాడ ఏరియా ఆసుపత్రి దర్శించి, అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను పరిశీలించి, సిబ్బంది రిక్వైర్మెంట్స్ కూడా గమనించి తగు సహాయం చేయాలి. గుడివాడ ఏరియా ఆసుపత్రి కి చాలా ప్రాముఖ్యత ఉంది. పేద వారికి ప్రభుత్వం తరఫున చక్కటి వైద్య సదుపాయం అందుతోంది.
దీనిని మరింత అభివృద్ధి చేయవలసి ఉంటుంది.