- ఎస్టీ అభ్యర్థులకు రెండు నెలలపాటు శిక్షణ
- మార్చి 5 నుంచి మే3 వరకు
- ఈ నెల 9 నుంచి 19 వరకు దరఖాస్తు గడువు
- ఎస్టీ స్టడీ సర్కిల్
జాతీయస్థాయిలో వివిధ బ్యాంకులు నిర్వహించే ప్రొబేషనరీ ఆఫీసర్స్(పీవో) పరీక్షలకు సిద్ధమయ్యే ఎస్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు గిరిజన సంక్షేమశాఖ ఏడీ సర్వేశ్వర్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బ్యాంకు పీవో(ప్రిలిమినరీ)తోపాటు క్లరికల్, ఎస్సెస్సీ, ఆర్‌ఆర్‌బీ తదితర పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు కూడా ఎస్టీ స్టడీ సర్కిల్‌లో శిక్షణ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. భద్రాచలం, వరంగల్, ఉట్నూర్, పీఈటీసీ, హైదరాబాద్‌లో ఉచిత శిక్షణకు ఏర్పాట్లు చేశామన్నారు. మార్చి 5 నుంచి మే3 వరకు రెండు నెలలపాటు శిక్షణ ఇస్తామని, అభ్యర్థులు ఈ నెల 9 నుంచి 19 వరకు దరఖాస్తు చేసుకోవాలని, http//studycircle.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. వివరాలకు 040-27540104 నంబర్‌లో సంప్రదించాలని సర్వేశ్వర్‌రెడ్డి సూచించారు.