ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఊరట లభించింది. ధర్మాబాద్ కోర్టులో అయనపై వున్న బాబ్లీ కేసు వారంట్ రికాల్ పిటిషన్ వాదనలు ముగిసాయి. శుక్రవారం నాడు గంటన్నర పాటు వాదనలు కొనసాగాయి. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా, మరో న్యాయవాది సుబ్బారావు.. చంద్రబాబు తరఫున రీకాల్ పిటిషన్ దాఖలు చేశారు. వ్యక్తిగత హజరు నుండి చంద్రబాబును మినహయించాలని చంద్రబాబు తరుపు న్యాయవాదులు కోరారు. ఈ నెల 15 న దర్మాబాద్ కోర్టులో వ్యక్తిగతంగా హజరు నుండి చంద్రబాబు కు మినహయింపును కోర్టు ఇచ్చింది. ఈ కేసులో సీఎం చంద్రబాబుకు 2018 జులై 5న కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీచేసింది. అయితే తొలుత పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి కోర్టుకు హాజరయ్యే అంశాన్ని చంద్రబాబు పరిశీలించారు. కానీ, అధికారులు, సన్నిహిత వర్గాల సూచన మేరకు రీకాల్ పిటిషన్ వేయాలని నిర్ణయించారు.