ప్రపంచంలోని మీడియా అంతా రఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలులో అవినీతి పై కధనాలు రాస్తున్నాయి. రఫెల్ కుంభకోణం దృష్టిని మరల్చడానికి రాష్ట్రంలో ఐటీ దాడులకు పాల్పడుతున్నారని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. అవినీతి అంతం చేస్తా,నల్లధనం వెలికి తీస్తా అని చెప్పిన మోడీ ఆయనే అవినీతి కూపంలో కూరుకుపోయారు. రఫెల్ యుద్ధ విమానాలు కొనులుపై ఎందుకు అంబానీ,కానీ ఆదాని కానీ మాట్లాడటంలేదని అన్నారు. మోడీ అవినీతిని ఎవరైతే ఎండగడుతున్నారో వారిపై ఐటీ దాడులు చేయిస్తున్నారు. వాజపేయి గారు సూపరిపాలన అందిస్తే మోడీ సుపారి పరిపాలన ఇస్తున్నారు. 2019 లో ప్రజలు మోడీ అవినీతిపై తగిన రీతిలో బుద్ధి చెబుతారని అన్నారు. రఫెల్ కుంభకోణంలో జాయింట్ పార్లమెంట్ కమిటీ ఎందుకు వేయడంలేదని ప్రశ్నించారు. అన్ని పత్రికలు ఆధారాలతో సహా ఏ విధంగా ప్రజల సొమ్ము తన సహచరులకు కట్టబెట్టారో రాస్తున్నారు. ఐటీ దాడులు అనేది సహజంగా జరిగే ప్రక్రియ అయినప్పుడు ,దేశంలో అందరూ పారిశ్రామిక వేత్తలపై జరగాలి కానీ ఏపీ లోనే ఎందుకు చేస్తున్నారని అడిగారు.