YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

కష్టాల్లో నుంచి తేరుకున్న కరేబియన్లు 295 పరుగులకు 7 వికెట్లు

 కష్టాల్లో నుంచి తేరుకున్న కరేబియన్లు 295 పరుగులకు 7 వికెట్లు

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం ఆరంభమైన రెండో టెస్టులో భారత్ జట్టుకి పర్యాటక వెస్టిండీస్ టీమ్‌ తొలిరోజు గట్టి పోటీనిచ్చింది. రోస్టన్ ఛేజ్ (98 బ్యాటింగ్: 174 బంతుల్లో 7x4, 1x6), కెప్టెన్ జేసన్ హోల్డర్ (52: 92 బంతుల్లో 6x4) అర్ధశతకాలు బాదడంతో ఈరోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ జట్టు 7 వికెట్లు కోల్పోయి 295 పరుగులు చేసింది. క్రీజులో ప్రస్తుతం రోస్టన్‌తో పాటు దేవేంద్ర బిషూ (2 బ్యాటింగ్: 15 బంతుల్లో) ఉన్నాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ (3/74), ఉమేశ్ యాదవ్ (3/83) ఆకట్టుకోగా.. అశ్విన్ (1/49) ఫర్వాలేదనిపించాడు. తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌లోనూ వెస్టిండీస్ 181, 196 పరుగులకే కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే.ఈ టెస్టులో టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఓపెనర్లు క్రైగ్ బ్రాత్‌వైట్ (14), కీరన్ పొవెల్ (22) తొలి సెషన్‌ ఆరంభంలోనే పెవిలియన్ బాట పట్టగా.. అనంతరం వచ్చిన షై హోప్ (36: 68 బంతుల్లో 5x4) క్రీజులో ఉన్నంతసేపూ హిట్టింగ్‌కి ప్రయత్నించాడు. దీంతో.. చాకచక్యంగా బౌలింగ్ చేసిన టీమిండియా బౌలర్లు హోప్‌తో పాటు హెట్‌మెయర్ (12), ఆంబ్రిస్ (18)ని బోల్తా కొట్టించేశారు. దీంతో.. వెస్టిండీస్ 38.5 ఓవర్లు ముగిసే సమయానికి 113/5తో కష్టాల్లో పడింది.తొలి టెస్టు తరహాలో తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించిన వెస్టిండీస్ జట్టుని రోస్టన్ ఛేజ్ అసాధారణ ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. తొలుత షేన్ డార్విచ్ (30: 63 బంతుల్లో 4x4, 1x6)తో కలిసి వికెట్ల పతనాన్ని అడ్డుకున్న రోస్టన్ ఛేజ్.. బ్యాట్ ఝళిపిస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే అతను అర్ధశతకం పూర్తిచేసుకోగా.. జట్టు స్కోరు 182 వద్ద డార్విచ్ ఔటైపోయాడు. కానీ.. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ జేసన్ హోల్డర్‌తో కలిసి ఛేజ్ వెస్టిండీస్‌ స్కోరుని 280 దాటించేశాడు. మరికొద్దిసేపట్లో ఈరోజు ఆట ముగుస్తుందన్న దశలో హోల్డర్ ఔటవగా.. ఆఖర్లో బిషూ అతి జాగ్రత్తగా ఆడి 295/7తో ఆటని ముగించాడు. 

Related Posts