మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనలో చేరాలని నిర్ణయించుకున్న ఆయన అంతకు ముందుగానే తెనాలి టిక్కెట్ ఆశించినట్టు తెలుస్తోంది. ఈ ఒప్పందం మేరకే ఆయన జనసేనలో చేరుతున్నట్లు సమాచారం. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడైన నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే రాష్ట్ర విభజన నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం పాలవడంతో గత ఎన్నికల్లో నాదెండ్ల డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. ఆ తర్వాత రాజకీయాకు దూరంగావుంటూవచ్చారు. కాగా మళ్లీ ఎన్నికలు దగ్గరకు వస్తున్ననేపధ్యం లో ఏదో ఓ పార్టీలో చేరాలని నాదెండ్ల నిర్ణయించుకున్నారట. ఆయకు ఉన్న రాజకీయ పరిమితుల నుంచి చూస్తే, టీడీపీ, వైసీపీల్లో అవకాశం లేకుండా పోయింది. ఫలితంగా నాదెండ్ల జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన చాలా రోజుల నుంచి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. తనకు పరిచయం ఉన్న వ్యక్తి, పవన్ కల్యాణ్‌కు సన్నిహితుడుగా పేరున్న పారిశ్రామిక వేత్త లింగమనేని రమేష్ సాయం తీసుకున్నారని తెలుస్తోంది. లింగమనేని ఆధ్వర్యంలో కొద్ది రోజుల క్రితం నిర్మించిన వెంకటేశ్వర ఆలయానికి సంబంధించి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాల్లో నాదెండ్ల మనోహర్ కీలకంగా వ్యవహరించారు. ఈ సమయంలోనే నాందెండ్ల తన మనసులోని భావాన్ని లింగమనేని ముందు చెప్పడం, అది కార్యరూపం దాల్చడం జరిగిందంటున్నారు. కాగా జనసేనలో చేరబోయే నాదెండ్ల మనోహర్ కు జనసేన తరపున గుంటూరు జిల్లా వ్యవహారాలు చక్కదిద్దే పని కూడా అప్పగించనున్నారని అంటున్నారు.దీంతో గుంటూరులో జనసేన కు ఒక బడా నేత దొరికి పార్టీ గట్టునపడుతుందని ఆ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలావుండగా జనసేన పార్టీ లోకి ఒక్కొక్కరుగా పెద్దనేతలు చేరుతుండటంతో పార్టీ తన బలం పెంచు కున్నట్లవుతున్నదనే అభిప్రాయం బలపడుతోంది. దీనికితోడు ఒకవైపు చంద్రబాబు ప్రభుత్వం ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నదనే ఆరోపణలు న్నాయి. అలాగే జగన్ కు పలు అంశాలలో విమర్శలు ఎదుర్కొంటూ వస్తు న్నారు. ఈ నేపధ్యంలో ఈ రెండు అంశాలను జనసేన తనకు అనుకూ లంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నదని సమాచారం. దీనికితోడు ఏపీ ఓటర్లు రాజకీయాల్లో కొత్తదనం కోరుకుంటున్నారన్న వార్తలు వస్తున్న నేప ధ్యంలో పవన్ కు మద్దతు పలికే అవకాశాలు ఉండవచ్చని రాజకీయ విశ్లేష కులు అంచనా వేస్తున్నారు.