శ్రీశైల క్షేత్రంలో దసరా నవరాత్రి మహోత్సవాల సంబరాలు అంబరాన్నంటాయి శ్రీశైలంలో నాల్గవ రోజు దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నవదుర్గల అవతారాల్లో ఒకటైన కూష్మాండ అలంకారంలో భ్రమరాంబదేవి భక్తులకు దర్శనమిస్తోంది. అమ్మవారిని ధ్యానిస్తే సర్వ సిద్ధులు లభిస్తాయని సిద్ధుల యొక్క విశ్వాసం మనస్సు అల్లకల్లోలమై సంఘర్షణలో ఉన్నప్పుడు ఈమాతని ధ్యానించటం వలన మనస్సుకు ప్రశాంతత లభిస్తుందని భక్తుల నమ్మకం ఈ నేపథ్యంలో శ్రీశైలం మహక్షేత్రంలో శ్రీ భ్రమరాంబాదేవి భక్తులకు చంద్రఘంట రూపంలో దర్శనమిచ్చింది అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు శ్రీశైలం ఆలయం భక్తులతో నిండిపోయింది . గ్రామోత్సవం సందర్బంగా ఉత్సవమూర్తుల ముందు కోలాటాలు బ్యాండ్ వాయిద్యాలు నడుమ గొరవయ్యల నాట్యాలు ఆటపాటలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి కల్లు మిరుమిట్లు గొలిపే విద్యుత్ ద్వీప కాంతుల నడుమ స్వామి అమ్మవార్లు గ్రామోత్సవం వైభవంగా సాగింది ఈ గ్రామోత్సవాన్ని తిలకించిన భక్తులు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అమ్మవారి అలంకార రూపానికి కర్పూర నీరాజనాలర్పించారు.