గుడివాడ లో ఉన్నటువంటి రైతు బజారు చాలా రద్దీగా ఉంటుంది. పక్కల గ్రామాల నుండి రైతులు దీనిని చక్కగా ఉపయోగించుకుంటున్నారు. రోజుకి రమారమి లక్ష రూపాయల వరకు వ్యాపారం ఇక్కడ జరుగుతుంది. ఈ మధ్యకాలంలో రైతులు సౌకర్యార్థం షెడ్లు వేశారు అందువలన అందరూ సంతోషంగా ఉన్నారు. ఈ షెడ్ల లో మంచినీటి వసతి ఫ్యాన్ సదుపాయం కూడా పెడితే బాగుంటుంది. ఫ్లోరింగ్ కి నిధులు మంజూరు అయ్యాయి, కానీ ఇంకా పనులు మొదలు పెట్టలేదు. వచ్చేవారికి ఫ్లోరింగ్ కొంత మంది కలగజేస్తోంది కావున త్వరగా పనులు మొదలు పెట్టాలి. ముఖ్యంగా ప్రవేశ ద్వారం ఎన్టీఆర్ స్టేడియం ఆధీనంలో ఉండటం వలన, ఈ ప్రదేశం అంతా చాలా మురికిగా ఉంది. దుర్గంధ పూరితమైన వాసన వస్తోంది. ప్రవేశ ద్వారం ఉన్న స్థలం స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఆధీనంలో ఉండటం వలన దీనిని రైతు బజార్ కు బదలాయించే విషయంలో కొంత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. కావున గుడివాడ రైతు బజార్ విషయంలో తగు సహాయం చేయాలి.