- ప్రత్యేక హోదా కోసం ఏపీ కాంగ్రెస్ ఆందోళన ఉధృతం
-- ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్ ఎంపీల ధర్నా
- మోడీకి భయపడుతున్న టీడీపీ, వైసీపీ నేతలు
- ఏపీ కాంగ్రెస్ చీఫ్ రఘువీరా రెడ్డి విమర్శ
మోడీ అంటే మీకు ప్యాంట్లు తడిసిపోతున్నాయి' అని టీడీపీ, వైసీపీ నేతలను ఉద్ధేశించి ఏపీ కాంగ్రెస్ చీఫ్ రఘువీరా రెడ్డి విమర్శించారు. ఢిల్లీ ఏపీ భవన్ ఆవరణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం ధర్నా ఏపీ కాంగ్రెస్ ఎంపీలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. టీడీపీ, వైసీపీ నేతలు మోడీకి భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. విభజన చట్టంలోని హామీలు, ప్రత్యేకహోదా, ప్యాకేజీ అంశం రాష్ట్ర ఎజెండాగా తయారయిందన్నారు. నిన్న జరిగిన వామపక్షాల బంద్ కు సంపూర్ణ మద్దతు ఇచ్చామని.. మిగిలిన పార్టీలు తోకముడుసుకొని బంద్ లో పాల్గొన్నాయని తెలిపారు. విభజన సందర్భంగా తాము రాజకీయంగా నష్టపోయి... రాష్ట్రానికి న్యాయం చేశామని తెలిపారు. రాష్ట్ర విభజనలో బీజేపీ, టీడీపీలు కూడా భాగమనే అని చెప్పారు. టీడీపీ, వైసీపీలకు కేంద్రంపై ఒత్తిడి చేయలేవని...తాము చేసే పోరాటంలో కలిసిరావాలని పిలుపునిచ్చారు. ఈ ధర్నాలో. ఏపీపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డితోపాటు రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, జేడీ శీలంతోపాటు పలువురు నేతలు ఆందోళనలో పాల్గొన్నారు. ప్రత్యేక హోదా కోసం ఏపీ కాంగ్రెస్ ఆందోళన ఉధృతం చేసింది. విభజన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.