శ్రీకాకుళంలో తిత్లి తుపాన్ సృష్టించిన భీభత్సం బాధ కలిగించిందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. తుపాన్ బాధితులకు అండగా ఉంటామని ఆయన చెప్పారు. తిత్లీ తుఫాన్ భాధాకారం వెంటనే అక్కడకు వెళ్ళాలనుకున్నా.. కాని ప్రజలు ఇబ్బందులు పడకూడదని వెనక్కి తగ్గాననని అన్నారు. పవన్, ఇటీవన జనసేనలో చేరని మాజీ స్పీకర్ నాదేండ్ల మనోహర్ లో కలసి మీడియాతో మాట్లాడారు. పవన్ మాట్లాడుతూ కవాతు తరవాత తూఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తా. మనోహర్ తో ఎప్పటి నుండే పరిచయం ఉంది. నాకు రాజకీయ సలహలు ఇచ్చేవాడని అన్నారు. భావితరాలకు బలమైన రాజకీయ వ్యవస్థను అందించాలనే లక్ష్యం తో ముందుకు సాగుతున్నాం. ఐటీ రైడ్స్ ప్రభుత్వ కార్యాలయాలుపై జరిగితే ప్రభుత్వానికి అండగా ఉండే వాళ్ళం. పారిశ్రామికవేత్తలు పై దాడులు జరిగితే టీడీపీ ఎందుకు ఉలిక్కి పడుతుందని ప్రశ్నించారు. గతంలో బలమైన రాజకీయ వ్యవస్థ లేక పోవటం వలనే రాష్ట్రం విడిపోయింది. ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి ఎందుకు సరైన నిర్ణయం తీసుకోవటంలేదు. టిడిపి బిజెపి ప్రజలకు అండగా ఉంటారనే గతంలో సపోర్ట్ చేశానని అన్నారు. మీ అనుభం ప్రజలను ఆయోమయం లోకి నెట్టడానికి ఉపయోగపడింది. బిజెపి కి ఎందుకు సపోర్ట చేస్తాం. మోడి నాబ్రదరా షా నా బాబాయా. నా కుటుంబాన్నే కాదనుకుని రాజకీయాలలో కి వచ్చానని అన్నారు. ముఖ్యమంత్రి గారు మీకు చిత్త శుద్ది ఉంటే వెంటనే అఖిలపక్ష పార్టీ ల సమావేశం ఎర్పాటు చేయండి. రాష్ట్ర ప్రజలకు మేలు చేయండని సూచించారు. పోలిటికల్ అకౌంటు బులిటి కోసమే కవాతు. ప్రజలకోసం మాట్లాడితే టీడీపీ కి నచ్చడం లేదు. గతంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశాల్లో చిత్త శుద్ధి లేదు అందుకే హజరు కాలేదని అన్నారు. జాయింట్ ప్యాక్ట్ పైండింగ్ కమిటి తేల్చిన బకాయిలపై ప్రజా ప్రతినిధులు పోరాడాలి. తెలంగాణ ఎన్నికలపై త్వరలో క్లారిటి ఇస్తా. వైసిపితో కలిసి వెళ్తారన్న ప్రశ్నకు పవన్ సమాధానం చెప్పలేదు. అయితే, అన్ని విషయాలు భవిష్యతులో మాట్లాడుకుందాం. నేను ఎక్కడికి పారిపోనని అన్నారు.