- యూఎస్ గవర్నమెంట్ మరోసారి షట్ డౌన్..
- మూడు వారాల వ్యవధిలో రెండోసారి..
యూఎస్ లో సెనెట్, హౌస్ ఆఫ్ కామన్స్, వైట్ హౌస్ తన నియంత్రణలోనే ఉన్నా, డొనాల్డ్ ట్రంప్ కు మరోసారి షాక్ తగిలింది. ఆయన మాటను ప్రతినిధులు అంగీకరించే పరిస్థితులు లేకపోవడంతో, మూడు వారాల వ్యవధిలో యూఎస్ గవర్నమెంట్ మరోసారి షట్ డౌన్ స్థితిలోకి వెళ్లిపోయింది. కీలకమైన ఆర్థిక బిల్లును సెనెట్ తిర్కరించింది. ఫెడరల్ ఫండింగ్ బిల్లు గత రాత్రితో ముగిసిపోగా, కొత్త ద్రవ్య పరపతికి ఆమోదం లభించక పోవడంతో అర్థరాత్రి నుంచి ప్రభుత్వ కార్యాలయాలు మూతబడ్డాయి.
ఒక్క డాలర్ కూడా బయటకు వెళ్లే అవకాశాలు లేకపోవడంతో సంక్షేమ పథకాలకు నిధులు లేని పరిస్థితి. నెనెట్ తో పాటు హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్ కూడా కొత్త బిల్లుకు ఆమోదం తెలపాల్సి వుండటంతో తాజా సంక్షోభం ఎన్ని రోజులు కొనసాగుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా, జనవరిలో ఆర్థిక బిల్లుకు ఆమోదం లభించకమూడు రోజుల పాటు ప్రభుత్వం స్తంభించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అత్యవసర అవసరాల నిమిత్తం ఓ తాత్కాలిక బిల్లును మూడు వారాల పాటు అమలులోకి తేగా, దాని కాలపరిమితి నిన్నటితో ముగిసింది.