ఉప్పల్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ నిలకడగా ఆడుతోంది. ప్రారంభంలో దూకుడు టీమిండియా దూకుడు ప్రదర్శించినప్పటికీ స్వల్ప వ్యవధిలోనే కీలక వికెట్లు కోల్పోవడంతో కాస్తా వేగం తగ్గించింది.మిడిలార్డర్ రిషబ్ పంత్ (84) శతకం దిగశగా అడుగులు వేస్తుండగా.. మరో బ్యాట్స్‌మన్ రహానే (73) కూడా అదే బాటలో పయనిస్తున్నాడు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ ఇప్పటి వరకు 218 బంతుల్లో 142పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. 79 ఓవర్లు ముగిసే సరికి భారత్ 4 వికెట్లు కోల్పోయి 304 పరుగులు చేసింది.ఉప్పల్ లో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ ఆలౌట్ అయింది. ఏడు వికెట్లకు 295 పరుగులతో రెండో రోజు బ్యాటింగ్ ను ప్రారంభించిన విండీస్... స్కోరు బోర్డుకు మరో 16 పరుగులు మాత్రమే జత చేసింది. మొత్తం మీద 101.4 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌట్ అయింది. మరోవైపు, భారత పేసర్ ఉమేష్ యాదవ్ తన కెరీల్ లో బెస్ట్ ఫిగర్స్ సాధించాడు. 88 పరుగులకు 6 వికెట్లు సాధించాడు. చివరి మూడు వికెట్లు కూడా ఉమేష్ ఖాతాలోకే చేరాయి.మరోవైపు విండీస్ బ్యాట్స్ మెన్ ఛేజ్ సెంచరీ సాధించాడు. 106 పరుగులకు ఉమేష్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. విండీస్ బ్యాట్స్ మెన్లలో పావెల్ 22, హోప్ 36, డౌరిచ్ 30, హోల్డర్ 52 పరుగులు చేశారు. వారికన్ 8 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇండియన్ బౌలర్లలో ఉమేష్ 6 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 3, అశ్విన్ 1 వికెట్ పడగొట్టారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ను టీమిండియా దూకుడుగా ప్రారంభించింది. తొలి టెస్టులో అరంగేట్రంలోనే అదరగొట్టి సెంచరీ చేసిన పృథ్వీ షా 13 బంతుల్లో 15 పరుగుల (2 ఫోర్లు, 1 సిక్స్)తో ఆడుతుండగా... ఒక బంతిని ఎదుర్కొన్న కేఎల్ రాహుల్ 3 పరుగులు చేశాడు.