యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబో మూవీ ‘అరవింద సమేత వీర రాఘవ’ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ తొలిరోజే టాలీవుడ్ రికార్డులను తిరగరాసింది. తొలిరోజు రికార్డ్ కలెక్షన్స్‌తో నాన్ బాహుబలి రికార్డ్స్‌ను తుడిచిపెట్టేసింది. ఎన్టీఆర్ కెరియర్‌లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్‌తో పాటు 2018లో బెగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా రికార్డులకెక్కింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 100 కోట్ల గ్రాస్ సాధించడమే కాకుండా ఓవర్సీస్‌లో తొలిరోజు మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరి రికార్డుల సునామి సృష్టించింది. ఇక ఆస్ట్రేలియాలోనూ అరవింద సమేత కాసుల వర్షం కురిపిస్తుంది. గురువారం నాడు A$ 128,740 డాలర్లు, శుక్రవారం నాడు A$ 69,666 డాలర్లతో మొత్తంగా 37 లొకేషన్లలో A$ 198,406 డాలర్లు (1. 04 కోట్లు) వసూలు చేసినట్టు మూవీ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. అయితే ఈ చిత్రాన్ని గతంలో విడుదలైన మిర్చి, సింహాద్రి చిత్రాలతో పోలుస్తూ.. పెదవి విరుపులు కనిపిస్తున్నప్పటికీ ఆ ప్రభావం కలెక్షన్స్‌పై పడలేదు. ఓవర్సీస్‌తో పాటు ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లో రెండోరోజు కలెక్షన్లు ఊపందుకున్నాయి. రెండో రోజు నాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 34.59 కోట్ల షేర్‌ను రాబట్టి పాత రికార్డులను చెరిపేసింది ఈ చిత్రం.
నైజాం ... 8.55 కోట్లు
సీడెడ్ ... 7. 44 కోట్లు
నెల్లూరు .. 1. 33 కోట్లు
క్రిష్ణా ... 2. 51 కోట్లు
గుంటూరు .. 4.82 కోట్లు
వైజాగ్ .. 4. 01 కోట్లు
ఈస్ట్ గోదావరి .. 3. 24 కోట్లు
వెస్ట్ గోదావారి .. 2. 69 కోట్లు
మొత్తంగా ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లో మూడో రోజు నాటికి 54. 59 కోట్ల షేర్‌ను వసూలు చేసింది అరవింద సమేత. ఇక శని, ఆదివారాలు కలిసి రావడం, పైగా దసరా పండుగకు సింగల్‌గా వచ్చిన ఈ మూవీకి పోటీగా పెద్ద సినిమాలు ఏవీ బరిలో లేకపోవడం కలెక్షన్ల కుమ్ముడు ఖాయంగానే కనిపిస్తుంది.