వెస్టిండీస్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ టీమిండియా మళ్లీ మూడు రోజుల్లోనే విజయ దుందుభి మోగించింది. రెండో ఇన్నింగ్స్‌లో పర్యాటక జట్టు నిర్దేశించిన 71 పరుగుల అతి స్వల్ప లక్ష్యాన్ని ఓపెనర్లు 16.1 ఓవర్లలోనే ఛేదించారు. పృథ్వీ షా(33; 45బంతుల్లో 4x4), కేఎల్ రాహుల్(33; 53 బంతుల్లో 1x4, 1x6) చక్కగా ఆడి పది వికెట్ల తేడాతో విజయం అందించారు. షా విన్నింగ్ షాట్ బాదేశాడు. 2-0తో సిరీస్ భారత్ వశమైంది.