YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

డోర్ డెలివరీ... ఇంటికే మద్యం

డోర్ డెలివరీ... ఇంటికే మద్యం
డ్రంకెన్ డ్రైవ్ ప్రమాదాలను నివారించడంలో భాగంగా దేశంలోనే తొలిసారిగా లిక్కర్ హోమ్ డెలివరీ చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు.
మద్యపాన నిషేధం చేస్తామని కొందరు నేతలు హామిలిస్తుంటారు. దశల వారీగా సంపూర్ణ మద్యపాన నిషేధమని సైతం వాగ్దానాలు చేస్తుంటారు. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం వినూత్నంగా ఆలోచించింది. ఆన్‌లైన్ షాపింగ్ తరహాలోనే మద్యాన్ని కూడా డోర్ డెలివరీ చేయాలని దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన పాలసీకి రూపకల్పన చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి చంద్రశేఖర్ బవాంకులే మీడియాతో మాట్లాడారు. డ్రంకెన్ డ్రైవ్ ప్రమాదాలను నివారించడంలో భాగంగా దేశంలోనే తొలిసారిగా లిక్కర్ హోమ్ డెలివరీ చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. లిక్కర్ ఇండస్ట్రీలో ఇదో విప్లవాత్మక మార్పుగా నిలుస్తుందన్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ రోజూ ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని, వాటిని అరికట్టాలంటే ఇది సరైన నిర్ణయమని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర ఉత్పత్తులను ఈ కామర్స్ సంస్థల నుంచి ఇంటికే తెప్పించుకున్నట్లుగా, ఇకనుంచీ మద్యం సైతం డోర్ డెలివరీ చేయనున్నట్లు వెల్లడించారు. మద్యం బుక్ చేసుకునేందుకు కింది నియమాలను ఖరారు చేస్తామన్నారు. బీర్ డోర్ డెలివరీ కావాలంటే కస్టమర్ వయసు 21ఏళ్లు ఉండాలని, ఐఎంఎఫ్ఎల్, దేశీ మద్యం బుక్ చేసుకోవాలంటే కస్టమర్ల వయసు 25ఏళ్లు ఉండాలని చెప్పారు. 
పర్మిషన్ లేకుండా మద్యం విక్రయిస్తే.. రూ. 5000 వేల నుంచి రూ.25000 వరకు జరిమానా, లేక 6 నెలల జైలుశిక్ష. కొన్ని సందర్భాలలో జరిమానాతో పాటు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది. కంపెనీలే స్వయంగా మద్యాన్ని ఆన్‌లైన్‌లో గానీ, లేక ఫోన్‌కాల్ చేసి ఆర్డర్లు అడిగితే.. 5000 రూపాయల జరిమానా, లేక 6 నెలల జైలుశిక్ష విధిస్తామని హెచ్చరించారు.నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక ప్రకారం 2015లో జరిగిన 4.64 లక్షల రోడ్డు ప్రమాదాల్లో 1.5 శాతం ప్రమాదాలు మద్యం సేవించి వాహనాలు నడపటం వల్ల జరిగాయి. రోజుకు 6 మంది చొప్పున చనిపోతున్నారు. ఆ రిపోర్టు ప్రకారం డ్రంకెన్ డ్రైవ్ కారణంగా ఏడాదికి 2,988 మంది ప్రాణాలు కోల్పోతున్నారని మంత్రి వివరించారు. 

Related Posts