ఈ ఏడాది చివరి నాటికి అన్ని దేశాల్లో విడుదల చేయడానికి సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఈ ఫోన్‌లో పలు ఆకర్షణీయమైన ఫీచర్లు జోడించినట్లు తెలుస్తోంది.
మొబైల్స్ తయారీదారు రేజర్ తన నూతన గేమింగ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. 'రేజర్ ఫోన్ 2'పేరుతో వచ్చిన ఈ ఫోన్‌ను అమెరికా, కెనడా, యూకే, యూరప్ మార్కెట్‌లలో సంస్థ విడుదల చేసింది. ఈ ఏడాది చివరి నాటికి అన్ని దేశాల్లో విడుదల చేయడానికి సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఈ ఫోన్‌లో పలు ఆకర్షణీయమైన ఫీచర్లు జోడించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ ఫోన్‌తో 8 ర్యామ్‌ను అందించారు. ఇక.. వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్ , ఐపీ 67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ లాంటి అద్భుత ఫీచర‍్లను కూడా ఈ ఫోన్‌లో పొందుపరిచారు. ఈస్మార్ట్‌ఫోన్ ధర సుమారు రూ.59,500 గా ఉండే అవకాశం ఉంది..
రేజర్ ఫోన్2 ఫీచర్లు
* 5.72 ఇంచెస్ డిస్‌ప్లే
* 2560 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
* 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్
* 8 జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజ్
* 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
* 12 +12 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా
* 8 ఎంపీ సెల్ఫీ కెమెరా,
* 4000 ఎంఏహెచ్ బ్యాటరీని