తిత్లి తుఫాన్ తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. టెక్నాలజీ సహాయంతో ప్రాణ నష్టం తగ్గించగలిగాం. అన్ని చూస్తున్న కేంద్రం మాత్రం సహాయం చేయటం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించిరు. సోమవారం అయన నీరు – ప్రగతిపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గోన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఏ విషయంలో కూడా సహకరించే పరిస్థితి లేదు. తుఫాన్ కారణంగా భారీగా ఆస్తి నష్టం జరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా సహకారం శూన్యం. సహాయం చేయమని అడిగిన ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. కష్టపడి పనిచేసి ప్రజలకు అందుబాటులో ఉంటూ సహాయక చర్యలు మనం చేపడుతుంటే ప్రతిపక్షాలు మనల్ని విమర్శిస్తున్నాయని అన్నారు. ప్రజలు అన్ని కోల్పోయి కష్టాలు పడుతుంటే దానిని కూడా రాజకీయం చేయటం దురదృష్టకరమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రంలో ఉన్న పార్టీ ఒకరకంగా ఇబ్బంది పెడితే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ మరో రకంగా ఇబ్బంది పెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. హక్కుల కోసం డిమాండ్ చేస్తుంటే దాడులు చేసే పరిస్థితికి వచ్చారని, ఐటీ దాడులతో అభివృద్ధికి ఆటంకం కలిగించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.