శ్రీకాకుళం జిల్లాలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మున్సిపాలిటీ మంత్రి నారాయణ పర్యటన చేస్తున్నారు బాధితులు కు కావలిసిన మంచి నీరు ఆహారం ,వసతి ప్రభుత్వం అందిస్తున్న నిత్యావసర వస్తువులు పంపిణి తో పాటు పలాస మున్సిపాలిటీలో సమస్యలు పరిష్కరించాలని అధికారులు ఆదేశించారు. పలాస, ఇచ్ఛాపురం మండలాలలో స్థానిక అధికారులు, నాయకులుతో కలిసి మంత్రి పారిశుధ్య పనులను పర్యవేక్షించారు. తరువాత మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాటర్ ట్యాంకర్లు, స్వీపింగ్ మిషన్లు తెప్పించామని అన్నారు. నిరంతరాయంగా నీటిని అందిస్తూ, పారిశుధ్య పనులు వేగవంతంగా చేస్తున్నామన్నారు. . అక్షయపాత్ర ఫౌండషన్, మెప్మా సహాయంతో ఆహారాన్ని అందిస్తున్నామని వెల్లడించారు. పలాసలో పదివేలమందికి, ఇచ్ఛాపురంలో ఎనిమిదివేల మందికి మూడు పూటలా ఆహారాన్ని అందిస్తున్నారు.