ఏపీని అత్యంత అవినీతి రాష్ట్రంగా చూపాలని బీజేపీ నేతలు, జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఏపీకి పెట్టుబడులు రాకుండా ఆగిపోయి గుజరాత్ కు వెళ్లిపోవాలని చూస్తున్నారు. రాష్ట్రం నాశనం కావాలని కోరుకుంటున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. సోమవారం నాడు ముత్తుకూరు మండలం మిట్టపాళెంలో అయన మీడియాతో మాట్లాడారు. వాళ్లు ఎంత ప్రయత్నించినా ఏపీని అవినీతి రాష్ట్రంగా చిత్రీకరించలేరు. ట్రాన్సపెరన్సీ ఇంటర్నేషనల్ ఇండియా నిర్వహించిన తాజా సర్వేలో అవినీతి తక్కువగా ఉన్న మూడు రాష్ట్రాల్లో ఏపీ ఒకటిగా నిలిచింది. అవినీతిలో మొదటి స్థానంలో బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ఉందని అయన అన్నారు. అత్యంత అవినీతి రాష్ట్రాల జాబితాలో టాప్ 5 లో బీజేపీ పాలిత యూపీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఉన్నాయి. తెలుగువారిగా పుట్టిన వైకాపా, బీజేపీ నేతలు కొందరు ఏపీ పరువు తీయాలని కుట్రలకు పాల్పడుతున్నారు. అధికారం కోసం లాలూచీ రాజకీయాలు చేయడం దురదృష్టకరమని అన్నారు. 2008లో సీఎంఎస్ సర్వే ప్రకారం అవినీతిలో వైఎస్సార్ ప్రభుత్వం ప్రథమ స్థానంలో నిలిచింది. 14 లక్షల పక్కా ఇళ్లు ఏమయ్యాయో తెలియదు. మీ మాదిరిగా నాయకులు, కార్యకర్తలకు దోచిపెట్టేందుకు, కమిషన్ల కోసం పథకాలు అమలు చేయడం లేదని అన్నారు. టీడీపీ ప్రభుత్వ పాలనలో ప్రతిపథకం పారదర్శకంగా ఓపద్ధతి ప్రకారం అమలు చేస్తున్నాం. రైతు రుణమాఫీ, పింఛన్లు, డ్వాక్రా రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఉపకార వేతనాలు, ఎన్టీఆర్ పక్కా ఇళ్లు తదితర అన్ని పథకాల్లోనూ నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రం పరువు తీయడానికే మీరు తయారయ్యారు. మీ మీద ఎందుకు కేసులున్నాయో, ఆస్తులు ఎందుకు జప్తు అయ్యాయో ప్రజలకు జగన్ సమాధానం చెప్పాలి. శ్రీకాకుళం జిల్లాలో తుఫాన్ బాధితులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు నాయుడు రేయింబవళ్లు సమీక్షలు నిర్వహించారు. సహాయచర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టామని అన్నారు. కొబ్బరి, జీడిమామిడి తోటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కూలిన చెట్లను కట్టర్లతో తొలగించే బాధ్యతను ప్రభుత్వమే చేపట్టింది. కొబ్బరి చెట్టుకు కేంద్రప్రభుత్వం రూ.300 ఇస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరో రూ.900 ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. జీడిమామిడి తోటలకు హెక్టారుకు రూ.25 వేలు నష్టపరిహారం ప్రకటించారని అన్నారు. కొబ్బరి, జీడిమామిడి తోటలను కొత్తగా వేసుకునేందుకు హెక్టారుకు రూ.40 వేలు వంతున మూడేళ్లకు సబ్సిడీ ఇవ్వనున్నాం. బోట్లు నష్టపోయిన మత్స్యకారులకు కూడా పూర్తిగా అండగా నిలుస్తున్నాం. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో బాధితులందరికీ ప్రభుత్వమే తాగునీరు, ఆహారం సరఫరా చేస్తోంది. ????ఒక్కో మండలానికి ఒక్కో మంత్రి ఇన్ చార్జిగా వ్యవహరిస్తూ సహాయచర్యలను పర్యవేక్షిస్తున్నామని అన్నారు.